Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. ఈ 4 ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

Realme Phones : రియల్‌మి అభిమానుల కోసం నాలుగు మోడల్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఓసారి వివరాలపై లుక్కేయండి.

Realme Phones : రియల్‌మి ఫ్యాన్స్‌కు పండగే.. ఈ 4 ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

Realme Phones

Updated On : May 21, 2025 / 11:03 AM IST

Realme Phones : రియల్‌‌మి అభిమానులకు గుడ్ న్యూస్.. రియల్‌మి P3 సిరీస్‌ (Realme Phones)పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S24 5G : భలే డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ఇంత తక్కువా.. కొనేసుకోవడం బెటర్..!

ఈ సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మి P3, రియల్‌మి P3x, రియల్‌మి P3 ప్రో, రియల్‌మి P3 అల్ట్రా ఉన్నాయి. మే 20 నుంచి మే 23 వరకు ఈ 4 మోడళ్లపై రూ.4వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది రియల్‌మి.

అందులో ప్రత్యేకించి P3, P3x ఫోన్లపై రూ.2వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.వెయ్యి ధర తగ్గింపు, మరో రూ.వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

రియల్‌మి P3x ఫోన్ 2 వేరియంట్లు (6GB + 128GB, 8GB + 128GB) ఫోన్లు వరుసగా రూ.13,999, రూ.14,999 రిలీజ్ అయ్యాయి. అయితే, డిస్కౌంట్‌ తర్వాత రూ.11,999, రూ.12,999లకు లభ్యమవుతున్నాయి.

రియల్‌మి P3 డిస్కౌంట్ (Realme Phones) :
రియల్‌మి P3 ఫోన్  3 వేరియంట్ల (6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB)లో వస్తుంది. ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.16,999, రూ.17,999, రూ.19,999కు పొందొచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.14,999, రూ.15,999, రూ.17,999కు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి P3 ప్రో డిస్కౌంట్ :
రియల్‌మి P3 ప్రో ధర రూ.4వేలు తగ్గింది. ఈ మోడల్ (8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB)మూడు స్టోరేజ్ ఆప్షన్లలో పొందొచ్చు.

వరుసగా రూ.23,999, రూ.24,999, రూ.26,999 ధరలకు పొందొచ్చు. డిస్కౌంట్ ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.19,999, రూ.20,999, రూ.22,999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

P3 అల్ట్రా డిస్కౌంట్ ((Realme Phones):
రియల్‌మి P3 అల్ట్రా  ధర రూ.3వేలు తగ్గింది. రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ ఉంటే రూ. వెయ్యి కూపన్ డిస్కౌంట్ ఉంది. ఈ P3 అల్ట్రా ఫోన్ (8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB) 3 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది.

Read Also : Android 16 Beta : ఆండ్రాయిడ్ 16 బీటా రిలీజ్.. సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్‌కు వచ్చిందా? చెక్ చేసుకోండి..!

ఈ ఫోన్ల ధర వరుసగా రూ.26,999, రూ.27,999, రూ.29,999గా ఉన్నాయి. డిస్కౌంట్ ద్వారా ఈ వేరియంట్లు రూ.23,999, రూ.24,999, రూ.26,999కు కొనేసుకోవచ్చు.