Samsung Galaxy S24 5G : భలే డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ఇంత తక్కువా.. కొనేసుకోవడం బెటర్..!

Samsung Galaxy S24 5G : శాంసంగ్ అభిమానులు కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 5G : భలే డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ఇంత తక్కువా.. కొనేసుకోవడం బెటర్..!

Samsung Galaxy S24 5G

Updated On : May 19, 2025 / 6:01 PM IST

Samsung Galaxy S24 5G : శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ S24 5G (Samsung Galaxy S24 5G) ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అది కూడా ఫ్లిప్ కార్ట్‌లో.. ప్రీమియం ఫీచర్లు, కాంపాక్ట్ ఫ్రేమ్‌తో ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ కలిగి ఉంది.

Read Also : UPI New Rule : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు NPCI కొత్త రూల్.. ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త..!

ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, అమోల్డ్ డిస్‌ప్లే, క్లీనర్ వన్ యూఐ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ రూ. 49వేల లోపు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 5G తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

శాంసంగ్ గెలాక్సీ S24 5G ధర :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ లాంచ్ ధర రూ.79,999 నుంచి రూ.50,999కి అందుబాటులో ఉంది. దీనిపై రూ.29వేల తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2,550 కూడా పొందవచ్చు.

బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందొచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.31,300 వరకు తగ్గింపు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ ఫోన్ 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 25W వైర్డు, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 ద్వారా సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, OIS, 8K వీడియో రికార్డింగ్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.

Read Also : EPF Passbook : UMANG యాప్‌తో మీ EPF పాస్‌బుక్ ఈజీగా చూడొచ్చు.. డౌన్‌లోడ్ చేయొచ్చు..!

ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ యూఐ 6.1 అప్‌డేట్ కలిగి ఉంది.