UPI New Rule : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు NPCI కొత్త రూల్.. ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త..!

UPI New Rule : యూపీఐ యూజర్ల పంపే నగదు భద్రత కోసం NPCI కొత్త రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ బెనిఫిషీయరీ నేమ్స్ తప్పనిసరిగా కనిపించాలి.

UPI New Rule : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు NPCI కొత్త రూల్.. ఇకపై యూపీఐ పేమెంట్ చేసే ముందు జాగ్రత్త..!

UPI New Rule

Updated On : May 19, 2025 / 4:51 PM IST

UPI New Rule : యూపీఐ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్ల కోసం కొత్త రూల్ వచ్చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

Read Also : Jio Offer : నెలవారీ రీఛార్జ్‌‌లతో విసిగిపోయారా? ఈ 2 జియో ప్లాన్లతో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

యూజర్ల డబ్బు భద్రత కోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అన్ని యూపీఐ యాప్‌లు పేమెంట్ చేసే ముందు ఎవరికి పంపుతున్నారో వ్యక్తి పేరు మాత్రమే యూజర్లకు చూపించాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. యూపీఐలో పేమెంట్ పంపే వ్యక్తి పేరు నేరుగా బ్యాంక్ అకౌంటుతో లింక్ అయి ఉంటుంది. QR కోడ్‌‌తో స్కాన్ చేసినప్పుడు పేర్లు లేదా పేమెంట్ చెల్లింపుదారు రిజిస్టర్ పేర్లు చూపించకూడదు.

యూజర్ల అసలు పేరు మాత్రమే కనిపించాలి. ఒకవేళ యూపీఐ యూజర్లు డబ్బు పంపే వ్యక్తి పేరును యాప్‌లో మార్చేందుకు ఏదైనా యాప్ వినియోగించినా యూపీఐ యాప్ డిసేబుల్ చేస్తాయి.

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసిన పేరుతో సంబంధం ఉండదు. మీరు డబ్బులు పంపే వ్యక్తి అసలు పేరు బ్యాంక్ రికార్డులలో విధంగా కనిపిస్తుంది.

మీరు కన్ఫర్మ్ బటన్‌ ట్యాప్ చేసే ముందు డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో వెరిఫికేషన్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ కొత్త యూపీఐ రూల్ జూన్ 30, 2025 నుంచి అమలులోకి రానుంది.

పీర్-టు-పీర్ (P2P), పీర్-టు-పీర్ మర్చంట్ (P2PM) లావాదేవీలు రెండింటికీ ఇది వర్తిస్తుంది. యూపీఐ యూజర్ల అకౌంట్లలో కచ్చితమైన సమాచారం, డబ్బులు భద్రంగా ఉంచుకోవచ్చు.

Read Also : Moto G85 5G : వండర్‌ఫుల్ డిస్కౌంట్.. మోటో G85 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి!

ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో పొరపాటున ఇతర కాంటాక్టును ఎంచుకుంటే.. పేమెంట్ ప్రాసెస్ అయ్యే ముందు మీకు వార్నింగ్ అలర్ట్ వస్తుంది. అప్పుడు ఆ పేమెంట్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది.