Split AC vs Window AC : చాలామంది AC కొనేటప్పుడు చేసే పెద్ద తప్పు ఇదే! స్ప్లిట్ లేదా విండో ఏసీ.. మీకు ఏది బెస్ట్ అంటే?
Split AC vs Window AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? స్ప్లిట్ ఏసీ తీసుకోవాలా? విండో ఏసీ తీసుకోవడం బెటరా? ఈ రెండింటిలో ఏది లివింగ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుందంటే?
- Sreehari A
- Updated on- April 29, 2026 / 02:06 PM IST
Split AC vs Window AC
- వేసవిలో కొత్త ఏసీ కొనాలని అనుకుంటున్నారా?
- మీ లివింగ్ రూమ్ కోసం ఎలాంటి ఏసీ తీసుకుంటే బెటర్?
- స్ప్లిట్ ఏసీ కొంటారా? విండో ఏసీ కొంటారా?
Split AC vs Window AC : బాబోయ్ ఎండలే ఎండలు.. కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే ఇంట్లో ఏసీ ఉండాల్సిందే.. అయితే, ఎలాంటి ఏసీ తీసుకుంటే బెటర్? మీ ఇంటి గదికి ఏ ఏసీ సరిపోతుంది? చాలామందికి ఇదే డౌట్ ఉంటుంది. సరైన ఏసీని ఎంచుకోకపోతే తగినంత కూలింగ్ అందించలేవు.
అందుకే మీ గదికి సరిపోయే ఏసీని ఎంచుకోవడం ఎంతైనా మంచిది. మీరు మీ ఇంట్లో లివింగ్ రూమ్ (Split AC vs Window AC) కోసం ఏసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ఇంతకీ స్ప్లిట్ ఏసీనా? లేదా విండో ఏసీనా? అంటే.. ఈ రెండూ ఏసీలు మీ గదిని కూలింగ్ అందిస్తాయి. రెండూ పవర్ వినియోగిస్తాయి. కానీ, ఇందులో లివింగ్ రూమ్‌కు ఏది బెస్ట్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
స్ప్లిట్ ఏసీ ఏంటి? :
స్ప్లిట్ ఏసీ రెండు భాగాలుగా వస్తుంది. గోడకు అమర్చే ఇండోర్ యూనిట్ ఒకటి. బయట ఉంచే అవుట్‌డోర్ కంప్రెసర్ యూనిట్ మరొకటి. మీ లివింగ్ రూమ్‌లో సరిగ్గా సరిపోతుంది. సౌండ్ చేసే కంప్రెసర్ బయట ఉండటం వల్ల ఈ ఏసీలు సాధారణంగా సైలెంట్ ఉంటాయి.
పెద్ద గదులను కూడా వేగంగా చల్లబరుస్తాయి. ఇన్వర్టర్ టెక్నాలజీ, ఎయిర్ క్లీనింగ్, స్మార్ట్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో వస్తాయి. ఇందులో నెగిటివ్ ఏమిటంటే.. ఇన్‌స్టాలేషన్ చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాగే ఖరీదైనది కూడా.
విండో ఏసీ అంటే ఏంటి? :
విండో ఏసీ అనేది కిటికీలో లేదా గోడలోని స్లాట్‌లో సరిపోయే సింగిల్ యూనిట్. ఇందులో కంప్రెసర్, కండెన్సర్ కూలింగ్ కాయిల్ వంటివన్నీ ఒకే బాక్సులో ఉంటాయి. ఇందులో అమర్చడం చాలా ఈజీ. సాధారణంగా స్ప్లిట్ ఏసీల కన్నా చౌకగా ఉంటాయి.
Read Also : Samsung Galaxy A37 : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
మీ బడ్జెట్ తక్కువగా ఉండి ఫాస్ట్ కూలింగ్ అవసరమైతే విండో ఏసీ బెస్ట్. అయితే, ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే?.. ఇవి ఎక్కువ సౌండ్ చేస్తాయి. సైజులో కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. కిటికీ కనిపించకుండా మొత్తం కప్పేస్తాయి.
ఏది బాగా కూలింగ్ అవుతుందంటే? :
పెద్ద లివింగ్ రూములకు, స్ప్లిట్ ఏసీలు బెస్ట్. చల్లటి గాలి సమానంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇన్వర్టర్ మోడళ్లు వేగంగా కూలింగ్ అవుతాయి. విండో ఏసీలు చిన్న లేదా మిడ్ రేంజ్ గదులలో బాగా పనిచేస్తాయి. కానీ, ఢిల్లీలో మండే ఎండల సమయంలో పెద్ద లివింగ్ రూమ్‌లో అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు.
పవర్ వినియోగం, బిల్లు ఎందులో ఎక్కువంటే? :
ఏసీ వాడకంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని ఆందోళన చెందుతున్నారా? వాస్తవానికి, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలు ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. విండో ఏసీలు, ముఖ్యంగా నాన్-ఇన్వర్టర్ ఏసీలు మాత్రం ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి.
మీకు పవర్ ఫుల్ కూలింగ్, సైలెంట్ పర్ఫార్మెన్స్, మీ లివింగ్ రూమ్‌కు ప్రీమియం లుక్ కావాలంటే స్ప్లిట్ ఏసీ తీసుకోవడమే బెటర్. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఇన్‌స్టాలేషన్ ఈజీగా ఉండాలనుకుంటూ మీ గది చిన్నగా ఉంటే, విండో ఏసీ మీకు మరింత సరైనదిగా ఉంటుంది.
