Credit Card Tips : విదేశాలలో మీ క్రెడిట్ కార్డు గీకితే మటాషే.. కార్డు స్వైప్ చేసే ముందు తప్పక తెలుసుకోండి!
Credit Card Tips : విదేశాల్లో పర్యటించే భారతీయులు క్రెడిట్ కార్డు వాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోండి. విదేశాల్లో అన్ని ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును వాడితే ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పడు చూద్దాం..
- Sreehari A
- Published On : March 28, 2026 / 07:35 PM IST
Credit Card
- విదేశాల్లో క్రెడిట్ కార్డు వాడితే లాభమా? నష్టమా?
- చిన్న అవసరాలకు క్రెడిట్ కార్డు అదేపనిగా వాడుతున్నారా?
- క్రెడిట్ కార్డు ఏయే సందర్భాల్లో వాడితే బెటర్?
Credit Card : విదేశాలకు వెళ్తున్నారా? మీరు ఈ సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా వర్క్ మీద విదేశాలకు వెళ్తుంటే ఇది మీకోసమే. సాధారణంగా చాలా మంది క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు వంటి బెనిఫిట్స్ పొందుతుంటారు. విదేశాలకు వెళ్లే వారు కూడా ఎక్కువగా ఈ క్రెడిట్ కార్డులే వాడుతుంటారు.
అయితే, విదేశాలలో క్రెడిట్ కార్డును వాడటం సేఫేనా? విదేశీ పర్యటనలో క్రెడిట్ కార్డు వాడితే ఏమౌతుంది? లాభమా? నష్టమా? అనేది ముందుగానే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి? ఫారెన్ టూర్ వెళ్లిన తర్వాత అక్కడ అవసరాల కోసం క్రెడిట్ కార్డు వాడాలా వద్దా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
విదేశాలలో క్రెడిట్ కార్డ్ వాడొచ్చా? :
విదేశాలలో క్రెడిట్ కార్డు వాడటం చాలా ఈజీగా అనిపించవచ్చు. కానీ, మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే హిడెన్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న ఖర్చులు కూడా పెద్దవిగా మారవచ్చు. తక్కువ మారకపు రేట్లు, ఇతర రుసుములతో మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి.
క్రెడిట్ కార్డు వాడితే ఏమౌతుంది? :
మీరు విదేశాలలో క్రెడిట్ కార్డు వాడితే ఎప్పుడూ చిన్న మొత్తంలో పేమెంట్లకే వాడండి. విదేశాలలో ఆస్తి లేదా పెట్టుబడుల కోసం క్రెడిట్ కార్డ్ వాడటం చట్టవిరుద్ధం. FEMA ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇలాంటి లావాదేవీలు ఎప్పుడూ బ్యాంకు ద్వారానే జరగాలి.
అలాగే, ఎల్లప్పుడూ లోకల్ కరెన్సీలోనే చెల్లించండి. పేమెంట్లు చేసేటప్పుడు రూపాయికి బదులుగా లోకల్ కరెన్సీని ఎంచుకోండి. రూపాయలలో పేమెంట్లు చేసేటప్పుడు డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) వర్తిస్తుంది. తద్వరా మీకు 5 శాతం నుంచి 10 శాతం వరకు అదనపు ఖర్చు కావచ్చు.
ఛార్జీల బాదుడు తప్పదు :
విదేశాలలో క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేసేటప్పుడు ఫారెక్స్ మార్కప్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీతో సహా అనేక ఛార్జీలు వర్తిస్తాయి. అందుకే క్రెడిట్ కార్డు స్వైప్ చేయాలా వద్దా అనేది ముందే డిసైడ్ చేసుకోండి. ఫారెక్స్ మార్కప్ ఫీజులు 3.5 శాతం, ప్రాసెసింగ్ ఫీజులు 1 శాతం, జీఎస్టీ 18 శాతం వరకు ఉండవచ్చు.
అంటే.. కార్డుతో చేసే చిన్న ఖర్చులు కూడా భారీగా పెరగవచ్చు. కార్డు స్వైప్ చేసినప్పుడు కనిపించే మొత్తం ఫైనల్ అమౌంట్ కాదు. అసలు మొత్తం 2 రోజుల నుంచి 3 రోజుల తర్వాత తెలుస్తుంది. ఈలోగా రూపాయి వాల్యూలో మార్పు జరిగితే మీ బిల్లు పెరగవచ్చు లేదా తగ్గొచ్చు.
