Tata Altroz iCNG AMT : ఇక ట్రాఫిక్‌లో టెన్షన్ లేదు.. టాటా కొత్త ఆల్ట్రోజ్ iCNG AMT అదుర్స్.. ప్రీమియం ఫీచర్లు కేక.. ధర జస్ట్ ఎంతంటే?
Tata Altroz iCNG AMT : టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ iCNG కొత్త AMT వెర్షన్ లాంచ్ చేసింది. మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Updated on- May 14, 2026 / 03:59 PM IST
Tata Altroz iCNG AMT
- టాటా మోటార్స్ నుంచి సరికొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG AMT లాంచ్
- భారత మార్కెట్లో CNG వాహనాలకు భారీగా పెరిగిన డిమాండ్
- టాటా ఆల్ట్రోజ్ iCNG AMT మొత్తం 5 వేరియంట్లు
Tata Altroz iCNG AMT : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత ఆటో మార్కెట్‌లో CNG వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ iCNG కొత్త AMT వెర్షన్‌ను లాంచ్ చేసింది.
ముఖ్యంగా, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNGతో పాటు ఎఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో దేశంలోనే ఫస్ట్ టైమ్ (Tata Altroz iCNG AMT) సింగిల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా టాటా ఆల్ట్రోజ్ నిలిచింది. కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా ఆల్ట్రోజ్ iCNG ధర ఎంతంటే? :
ధర విషయానికి వస్తే.. కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG ధర రూ. 8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ 5 వేరియంట్లలో అందిస్తోంది. ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, అకంప్లిష్డ్ ఎస్ ఉన్నాయి. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.
- ప్యూర్ : రూ. 8.69 లక్షలు
- ప్యూర్ ఎస్ : రూ. 8.99 లక్షలు
- క్రియేటివ్ : రూ. 9.56 లక్షలు
- క్రియేటివ్ ఎస్ : రూ. 9.81 లక్షలు
- ఎకంప్లీషడ్ : రూ. 10.76 లక్షలు
కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG ఇంజిన్, పర్ఫార్మెన్స్ :
కొత్త ఆల్ట్రోజ్ iCNG ఎఎంటీ, 1.2-లీటర్ రెవోట్రాన్ iCNG ఇంజన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజన్ CNG మోడ్‌లో 73.5 PS పవర్, 103Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను ఫస్ట్ టైమ్ AMT గేర్‌బాక్స్‌తో అమర్చారు. సిటీ డ్రైవింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
Read Also : Oppo Find X9 Series : ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్లు భయ్యా.. మే 21నే వచ్చేస్తున్నాయ్.. ధర ఎంత ఉండొచ్చంటే?
కంపెనీ ప్రకారం.. ఇందులో సింగిల్ అడ్వాన్స్ ఈసీయూ సిస్టమ్ ఉంది. పెట్రోల్, CNG మోడ్‌ల మధ్య ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. ఈ కారులో డైరెక్ట్ CNG స్టార్ట్ ఫీచర్ కూడా ఉంది. కారు నేరుగా CNG మోడ్‌లో స్టార్ట్ అవుతుంది.
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్‌లో ట్విన్-సిలిండర్ iCNG టెక్నాలజీతో వస్తుంది. రెండు చిన్న సిలిండర్లను బూట్ ఫ్లోర్ కింద అమర్చారు. ఫలితంగా CNG వెర్షన్‌లో 210-లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అయితే, పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లు 345 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తాయి.
కొత్త టాటా ఆల్ట్రోజ్ iCNG డిజైన్, ఫీచర్లు :
కొత్త ఆల్ట్రోజ్ iCNG ఎఎంటీతో వస్తుంది. ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, LED హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, ట్విన్ 26.03 సెం.మీ డిజిటల్ డిస్‌ప్లేలు, హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్యాక్ సీట్ల వంటి అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
సేఫ్టీ పరంగా టాటా ఆల్ట్రోజ్ ఇండియా NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ రేటింగ్ పెట్రోల్, డీజిల్, CNG అనే 3 వెర్షన్‌లకు వర్తిస్తుంది. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
