×
Ad

Top Selling SUVs: టాటా కారు లవర్స్ మీకోసమే.. అత్యధికంగా అమ్ముడైన టాటా SUVలు ఇవే.. టాటా పంచ్, నెక్సాన్ ఏది కొంటే బెటర్?

Top Selling SUVs: మీరు టాటా కారు కొనాలనుకుంటే ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన రెండు SUV మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ధర వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published On : February 15, 2026 / 07:50 PM IST

Top Selling SUVs ( Image Credit to Original Source )

  • టాటా కారు కొనాలని చూస్తున్నారా?
  • టాటా అత్యధికంగా అమ్ముడైన 2 SUV మోడల్స్ ఇవే
  • టాటా పంచ్, టాటా నెక్సాన్ మోడల్స్ టాప్ లిస్టులో

Top Selling SUVs : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీరు టాటా కారు లవర్స్ అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాటా SUV మోడల్ కార్లలో టాటా పంచ్, టాటా నెక్సాన్ ఉన్నాయి. పంచ్, నెక్సాన్ చిన్న SUV మోడల్స్ అయినప్పటికీ అమ్మకాల పరంగా అత్యధికంగా అమ్ముడైన కార్లుగా నిలిచాయి.

దేశంలోనే ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్ కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. టాటా కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టాటా నెక్సాన్, హారియర్, సఫారీతో సహా అనేక పాపులర్ ఎస్‌యూవీలు ఉన్నాయి. మీరు భవిష్యత్తులో టాటా బెస్ట్ SUV కొనాలని అనుకుంటే టాటా అత్యధికంగా అమ్ముడైన రెండు SUVల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.

భారత మార్కెట్లో టాటా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో టాటా పంచ్, టాటా నెక్సాన్ ఉన్నాయి. పంచ్, నెక్సాన్ చిన్న ఎస్‌యూవీలు అయినప్పటికీ, అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లుగా నిలిచాయి.

Read Also : Waterproof Mobiles : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ. 25వేల లోపు టాప్ 5 వాటర్ ప్రూఫ్ మొబైల్స్.. నీళ్లలో తడిసినా డోంట్ కేర్..

టాటా పంచ్ :
టాటా పంచ్ SUV విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. జనవరి 2026లో ఈ కారు 19,257 యూనిట్ల అమ్మకాలతో ఇప్పటివరకు అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. టాటా పంచ్ 7లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది.

ఆటో ఇండస్ట్రీలోనే అత్యంత వేగవంతమైన కారుగా నిలిచింది. కేవలం 4 సంవత్సరాల 3 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుంది. టాటా పంచ్ ధరలు రూ. 5.59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే, టాప్-స్పెషిఫికేషన్ల వేరియంట్ ధర రూ. 12.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టాటా నెక్సన్ :
టాటా నెక్సాన్ కారు అనేది టాటా మోటార్స్ బాగా పాపులర్ మోడల్, అలాగే అత్యధికంగా అమ్ముడైన SUV కూడా. జనవరి 2026లో రికార్డు స్థాయిలో 23,365 యూనిట్ల టాటా నెక్సాన్ అమ్మకాలు జరిగాయి.

2017లో లాంచ్ దగ్గర నుంచి నెక్సాన్ ఒక మిలియన్ యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసింది. ధర విషయానికి వస్తే.. టాటా నెక్సాన్ రూ. 7.31 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమైతే, టాప్-స్పెక్ వేరియంట్ రూ. 16.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అమ్ముడైంది.