Tata EV Cars : ఎలక్ట్రిక్ కారు కొనేందుకు సువర్ణావకాశం! టాటా టియాగో, హారియర్‌పై రూ. 2.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
Tata EV Cars : ఈ జూన్ నెలలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కర్వ్ ఈవీపై రూ. 3.35 లక్షల వరకు అత్యధిక డిస్కౌంట్, హారియర్ ఈవీపై రూ. 2.75 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
- Sreehari A
- Published on- June 6, 2026 / 07:39 PM IST
Tata EV Cars Discounts
- టాటా ఎలక్ట్రిక్ కార్లపై అద్భుతమైన భారీ డిస్కౌంట్లు
- టాటా టియాగో, హారియర్ కార్లపై రూ. 2.75 లక్షల తగ్గింపు
- ఈ జూన్ నెలలో టాటా ఈవీ కార్లపై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే?
Tata EV Cars : టాటా లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. టాటా మోటార్స్ జూన్ 2026 నుంచి ఎలక్ట్రిక్ కార్లు అన్నింటిపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను ప్రకటించింది.
ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 3.35 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు ఎంచుకున్న (Tata EV Cars) మోడల్ బట్టి గ్రీన్ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు, ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు.
ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు టాటా ఈవీ కార్ల పోర్ట్‌ఫోలియోలోని ప్రస్తుత, కొత్త వేరియంట్లకు వర్తిస్తాయి. మీరు టాటా ఈవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. వేరియంట్, ప్రాంతాన్ని బట్టి డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. మీ దగ్గరలోని డీలర్‌షిప్ వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చు..
టాటా కర్వ్ ఈవీ :
ఈ నెలలో కర్వ్ ఈవీ అత్యధిక డిస్కౌంట్లను అందిస్తోంది. ఎంపిక చేసిన నాన్-ఎక్స్ వేరియంట్లు రూ. 3.35 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 3 లక్షల గ్రీన్ బోనస్, రూ. 30వేలు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ. 35వేల స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
క్రియేటివ్ వేరియంట్ రూ. 2.85 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. టాటా కర్వ్ ఈవీ ఎక్స్ వేరియంట్ ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ లాయల్టీ బెనిఫిట్స్ సహా రూ. 65వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.
టాటా హారియర్ ఈవీ :
అన్ని హారియర్ ఈవీ వేరియంట్లు రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో రూ. 50వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 75వేలు స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.లక్ష లాయల్టీ బోనస్, రూ.లక్ష అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
టాటా పంచ్ ఈవీ :
ప్రస్తుత టాటా పంచ్ ఈవీ వేరియంట్లు రూ. 95వేల నుంచి రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. ఎల్ఆర్ వేరియంట్ రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు, ఎంఆర్ వేరియంట్ రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఎంఆర్ స్మార్ట్ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 95వేలు తగ్గింపు అందిస్తుంది.
టాటా టియాగో ఈవీ :
ప్రస్తుత టియాగో ఈవీ కారు రూ.65వేల నుంచి రూ. 1.45 లక్షల వరకు డిస్కౌంట్లతో లభిస్తోంది. ఎల్ఆర్ ఎక్స్‌టీ వేరియంట్ అత్యధికంగా రూ. 1.45 లక్షల తగ్గింపు పొందవచ్చు.
అదనంగా రూ. 50వేలు కూడా తగ్గింపు అందిస్తోంది. ఇతర ఎల్ఆర్ వేరియంట్లు రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు, ఎంఆర్ వేరియంట్ రూ. 65వేల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.
టాటా నెక్సాన్ ఈవీ :
నెక్సాన్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ. 50వేల వరకు డిస్కౌంట్లతో లభిస్తోంది. ఇందులో రూ. 15వేలు గ్రీన్ బోనస్, రూ. 25వేలు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ. 35వేల స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
