Tesla Mall Charging Station : టెస్లా కొత్త ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్ ఇదిగో.. జస్ట్ 15 నిమిషాల్లో ఈవీ కార్లు ఛార్జ్ చేస్తుంది.. ముంబైలో ఎక్కడంటే?

Tesla Mall Charging Station : భారత మార్కెట్లో ఫస్ట్ ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్‌ను టెస్లా ప్రారంభించింది. నవీ ముంబైలోని ఈ కొత్త ఛార్జింగ్ హబ్ ద్వారా ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Tesla Mall Charging Station

  • టెస్లా కొత్త ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్‌ ప్రారంభం
  • నవీ ముంబైలో టెస్లాకు మొత్తం 4 ఛార్జింగ్ సెంటర్లు
  • టెస్లా మోడల్ Yని కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు

Tesla Mall Charging Station : టెస్లా కారు కొనేందుకు చూస్తున్నారా? అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో ఫస్ట్ ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. నవీ ముంబైలో ఉన్న ఈ కొత్త ఛార్జింగ్ హబ్ ద్వారా వినియోగదారులు షాపింగ్ చేస్తున్నప్పుడు తమ ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మాల్‌లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్ :
నవీ ముంబైలోని నెక్సస్ సీవుడ్స్ మాల్‌లో టెస్లా కొత్త ఇన్-మాల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ స్టేషన్‌లో 4 V4 సూపర్ ఛార్జర్లు (DC), 4 డెస్టినేషన్ ఛార్జర్లు (AC) సహా మొత్తం 8 ఛార్జర్లు ఉన్నాయి.

టెస్లా V4 సూపర్ ఛార్జర్లు 250kW హై స్పీడ్ తో రన్ అవుతాయి. డెస్టినేషన్ ఛార్జర్లు (AC) 11kW సామర్థ్యంతో ఛార్జ్ చేస్తాయి. మాల్‌లో షాపింగ్ చేస్తూనే టెస్లా కార్లను ఛార్జ్ చేసుకోవచ్చు.

టెస్లా కారు 15 నిమిషాల్లో ఛార్జింగ్ :
సూపర్‌ఛార్జర్‌ను ఉపయోగించి టెస్లా మోడల్ Yని కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 275 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. నవీ ముంబై నుంచి పూణే వంటి నగరాల మధ్య ప్రయాణాలు చాలా ఈజీ కానున్నాయి. కంపెనీ “ప్లగ్ ఇన్, ఛార్జ్ అండ్ గో” సిస్టమ్ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉండగా అప్‌టైమ్ 99.95శాతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Read Also : Redmi Note 15 SE Series : రెడ్‌మి నోట్ 15 SE కొనాలా? రెడ్‌మి నోట్ 15 కొనాలా? ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్..!

నవీ ముంబైలోని కొత్త హబ్‌తో టెస్లాకు ఇప్పుడు మొత్తం 4 ఛార్జింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో డీఎల్‌ఎఫ్ హారిజన్ సెంటర్, వరల్డ్‌మార్క్ 3 ఏరోసిటీ, వన్ బీకేసీ ఉన్నాయి. దేశంలో టెస్లాకు ఇప్పుడు మొత్తం 20 సూపర్‌ఛార్జర్‌లు, 14 డెస్టినేషన్ ఛార్జర్‌లు అందుబాటులో ఉన్నాయి.

టెస్లా ఈవీ ధర ఎంతంటే? :
ప్రస్తుతం భారత మార్కెట్లో టెస్లా మోడల్ వై ఈవీని విక్రయిస్తోంది. టెస్లా మోడల్ వై ఈవీ ప్రారంభ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది. రెండో టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ల ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందిస్తోంది. అధిక దిగుమతి సుంకాల కారణంగా ప్రపంచ మార్కెట్ కన్నా భారత్ ధర ఎక్కువగా ఉంది.