Ola Roadster X+ : జస్ట్ 1 రూపాయికే 5 కి.మీ.. ఓలా వారి వండర్ ఫుల్ బైక్.. రేటు ఎంతంటే.. జస్ట్!
Ola Roadster X+ : ఈ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X+ బైక్ 11kW మోటార్‌తో గంటకు 125 కి.మీ టాప్ స్పీడ్ అందిస్తూ 501 కి.మీ రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ బైకు ధర ఎంతో తెలుసా?
- Sreehari A
- Published On : April 4, 2026 / 08:14 PM IST
Ola Roadster X+
- ఒక రూపాయికి 5 కి.మీ దూసుకెళ్లగలదు
- సింగల్ రీచార్జ్ చేస్తే చాలు 500 కి.మీ ప్రయాణించవచ్చు
- విజయవాడ వెళ్లి రావడానికి రూ. 100 నుంచి రూ. 120 ఖర్చు
- గంటకు 125 కి.మీ టాప్ స్పీడ్, లిమిటెడ్ ఆఫర్
Roadster X+ : ఓలా ఎలక్ట్రిక్ బైక్ లవర్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓలా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఇ-బైక్ మోడల్ రోడ్‌స్టర్ X+ 9.1kWh ధరను భారీగా తగ్గించింది. ఈ బైకుపై ఏకంగా రూ. 60వేలు తగ్గించింది.
దీంతో ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,89,999 నుంచి కేవలం రూ. 1,29,999కు చేరింది. ఈ తగ్గింపు వాహనదారులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ బైక్ కొనాలని అనుకునేవారికి అద్భుతమైన అవకాశం కూడా.
రూపాయికి 5 కి.మీ : ఖర్చు తక్కువ.. ప్రయాణం ఎక్కువ :
ఈ ఓలా ఎలక్ట్రిక్ బైక్ స్పెషాలిటీ ఇదే.. అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. కేవలం ఒక రూపాయికి సుమారు 5 కి.మీ దూసుకెళ్లగలదు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే.. దాదాపు 501 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అంటే.. రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాదు.
లాంగ్ టూర్ ప్రయాణాలకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ లెక్కన మీరు విజయవాడ వెళ్లి రావడానికి సుమారు రూ. 100 నుంచి రూ. 120 మధ్య ఖర్చు అవుతుంది అంతే. పెట్రోల్ ధరలతో పోలిస్తే చాలా చౌకగా లభిస్తుంది. డబ్బులు కూడా బాగా సేవ్ అవుతాయి.
పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ : స్పీడ్, రేంజ్ అద్భుతం :
ఓలా రోడ్‌స్టర్ X+ 9.1kWhలో 11kW ఎలక్ట్రిక్ మోటార్ అందిస్తుంది. గంటకు 125 కి.మీ టాప్ స్పీడ్ అందిస్తుంది. హై పవర్, మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఓలా బైక్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. లాంగ్ రేంజ్, స్పీడ్ కారణంగా ఈ మోడల్‌ను మార్కెట్లో ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది.
గిగాఫ్యాక్టరీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన ధరలు :
ధర తగ్గింపుకు ప్రధాన కారణం.. కంపెనీ గిగాఫ్యాక్టరీలో 4680 భారత్ సెల్ ఉత్పత్తిని వేగంగా పెంచడమే.. ఉత్పత్తి పెరగడంతో తయారీ ఖర్చులు తగ్గాయి. ఇప్పుడు కంపెనీ ఆ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకు అందిస్తోంది.
లిమిటెడ్ ఆఫర్.. ఫుల్ డిమాండ్ :
ఈ ఓలా రోడ్‌స్టర్ X+ బైక్ కోసం కంపెనీ కొత్తగా లిమిటెడ్ సేల్ విండో మోడల్‌ను ప్రవేశపెట్టింది. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే లిమిటెడ్ సంఖ్యలో బైక్‌లను అందిస్తోంది. ఫస్ట్ విండో ఏప్రిల్ 3 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంది.
డిమాండ్‌ను బట్టి తర్వాతి విండోలను ఓలా ప్రకటించనుంది. ప్రస్తుతానికి ఫస్ట్ విండో ముగిసింది. మొత్తంగా ఈ ధర తగ్గింపు, అద్భుతమైన ఫీచర్లతో రోడ్‌స్టర్ X+ 9.1kWhను కస్టమర్లకు అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
