×
Ad

UpComing Bikes in 2026 : మార్కెట్ గేమ్ ఛేంజర్స్.. 2026లో రాబోయే 4 స్టన్నింగ్ బైకులివే.. ధర రూ. 5 లక్షల లోపే.. మీ ఫేవరెట్ బైక్ ఇదేనా?

UpComing Bikes in 2026 : ఈ 4 అద్భుతమైన బైక్‌లు వచ్చే ఏడాది రూ. 5 లక్షల లోపు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు వివిధ బైకుల ఆప్షన్లు ఉన్నాయి.

UpComing Bikes in 2026

UpComing Bikes in 2026 : మీరు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? 2026 రాబోయే ఏడాదిలో ఆటోమొబైల్ మార్కెట్ సరికొత్త బైకులతో సందడిగా మారనుంది. ప్రత్యేకించి భారత మార్కెట్లో అతి త్వరలో అనేక పవర్‌ఫుల్ మోటార్ సైకిళ్లు విడుదల కానున్నాయి. ఈ బైకుల ధర రూ. 5 లక్షల లోపు ఉంటుంది. ఇందులో BMW KTM వంటి ప్రధాన కంపెనీల మోడల్స్ ఉన్నాయి.

ఈ బైక్‌లు అడ్వెంచర్, స్పోర్ట్స్, క్రూయిజర్‌తో (UpComing Bikes in 2026) సహా అన్ని రకాల రైడింగ్‌లకు ఆప్షన్లను అందిస్తాయి. కొత్త ఇంజన్లు, ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ బైక్‌లు 2026లో అత్యంత ఆకర్షణీయంగా మారనున్నాయి. బైక్ ప్రియులు అత్యంత ఎదురుచూస్తున్న రాబోయే 4 బైక్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తెలుసుకుందాం.

బీఎమ్‌డబ్ల్యూ F450 జీఎస్ :
ఈ ఎంట్రీ-లెవల్ బీఎండబ్ల్యూ మోడల్ సాహస ప్రియులకు అద్భుతమైన ఆప్షన్. ఈ బైక్ 420cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. 48bhp, 43Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ క్లచ్‌లెస్ షిఫ్ట్ (ఈజీ రైడ్ క్లచ్)తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ. 4లక్షల నుంచి రూ.5లక్షల మధ్య ఉంటుందని అంచనా.

Read Also : 2025 Best Smart TVs : కొంటే ఇలాంటి టీవీలు కొనాలి.. 2025లో 6 బెస్ట్ సరసమైన స్మార్ట్ టీవీలు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి..!

బ్రిక్స్టన్ క్రాస్ ఫైర్ 500 స్టోర్ :
మీరు కాస్త అడ్వెంచర్-టూర్ రైడ్ కోరుకుంటే.. క్రాస్ ఫైర్ 500 స్టోర్ మీకు అద్భుతమైన బైక్. 47bhp, 43Nm టార్క్ ఉత్పత్తి చేసే 486cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. ఈ బైక్ సిటీలో సుదూర రైడింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది.

కేటీఎమ్ ఆర్‌సీ 390 :
మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులైతే.. కేటీఎం RC 390 బైక్ మీ కోసమే. 2026 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 399cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 45bhp, 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-అంగుళాల TFT డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS ఆప్షన్లు కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 3 లక్షలు ఉంటుంది.

కేటీఎమ్ ఆర్‌సీ 160 :
మీరు డైలీ రైడింగ్ కోసం బైక్ చూస్తున్నారా? మార్కెట్లోకి కొత్త కేటీఎం ఆర్‌సీ 160 బైక్ రాబోతుంది. ఈ బైక్ అత్యంత తేలికైనది. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది. 164.2cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో ఈ బైక్ సౌకర్యవంతమైన ప్రయాణానికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కేటీఎం ఆర్‌సీ 160 అంచనా ధర సుమారు రూ. 2 లక్షలు ఉంటుంది.