2025 Best Smart TVs : కొంటే ఇలాంటి టీవీలు కొనాలి.. 2025లో 6 బెస్ట్ సరసమైన స్మార్ట్ టీవీలు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి..!

2025 Best Smart TVs : భారతీయ మార్కెట్లో అత్యంత సరసైమన ధరలో 6 బెస్ట్ స్మార్ట్ టీవీలు లభ్యమవుతున్నాయి. 2025లో వచ్చిన ఈ స్మార్ట్ టీవీలపై ఓసారి లుక్కేయండి..

2025 Best Smart TVs : కొంటే ఇలాంటి టీవీలు కొనాలి.. 2025లో 6 బెస్ట్ సరసమైన స్మార్ట్ టీవీలు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి..!

2025 Best Smart TVs

Updated On : December 10, 2025 / 2:25 PM IST

2025 Best Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? అయితే ఇది మీకోసమే.. 2025 ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో అద్భుతమైన ఫీచర్లతో అనేక బ్రాండ్ల స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. అత్యంత సరసమైన ధరలో ప్రీమియం ఫీచర్లతో కొత్త స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వచ్చాయి.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో (2025 Best Smart TVs) ఉన్న కొన్ని స్మార్ట్‌టీవీలకు ఫుల్ క్రేజ్ ఉంది. మంచి డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లతో పాటు సరసమైన ధరలో కొత్త టీవీ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. 2025లో భారీగా అమ్ముడైన 6 బెస్ట్ స్మార్ట్ టీవీలను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోండి.

​శాంసంగ్ 108cm (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ (రూ. 25,490) :
శాంసంగ్ టీవీలో టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అల్ట్రా HD (4K) రిజల్యూషన్ (3840 x 2160) ఉంది. 50Hz రిఫ్రెష్ రేట్, ఏకీకృత కంట్రోలింగ్ కోసం Anynet+ (HDMI-CEC) టెరెస్ట్రియల్/కేబుల్ ఇన్‌పుట్ కోసం RFIn పోర్ట్‌ను కలిగి ఉంది. సెట్-టాప్ బాక్స్, హోమ్ థియేటర్ సిస్టమ్ లేదా గేమింగ్ కన్సోల్‌ను కనెక్ట్ చేసేందుకు ఈ టీవీలో 3 HDMI పోర్ట్‌లు కూడా ఉన్నాయి.

సోనీ బ్రావియా 2 II 109.22 సెం.మీ (రూ. 38,490) :
ఈ ఏడాదిలో లాంచ్ అయిన సోనీ బ్రావియా 2II టీవీ 3840 x 2160 పిక్సెల్ రిజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌సీడీ 4K అల్ట్రా HD డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Wi-Fi, 4 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, బ్లూటూత్ v5.3, డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ RF యాంటెన్నా ఇన్‌పుట్‌తో సహా టాప్ కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది.

Read Also : Jio Recharge Plans : పండగ చేస్కోండి.. జియో బెస్ట్ రీఛార్జ్ వార్షిక ప్లాన్లు.. OTT బెనిఫిట్స్ కూడా.. 2026 ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు..!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డాల్బీ అట్మోస్ సపోర్టుతో 20W స్పీకర్‌లను కలిగి ఉంటుంది. అదనంగా, సోనీ బ్రావియా 2II అత్యుత్తమ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం డైనమిక్ బ్యాక్‌లైట్ కంట్రోల్, లైవ్ కలర్ టెక్నాలజీ ఇంటర్నల్ క్రోమ్‌క్యాస్ట్ ఆప్షన్ కలిగి ఉంటుంది.

LG 108cm (43) నానో 83A స్మార్ట్ టీవీ (రూ. 35,290) :

LG NANO 83A α7 AI ప్రాసెసర్ 4K జెన్8 ద్వారా ఆధారితమైన స్పష్టమైన కలర్ ఆప్షన్లలో 4K పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఏఐ మ్యాజిక్ రిమోట్ ద్వారా వాయిస్ కంట్రోల్స్, డ్రాగ్-అండ్-డ్రాప్ ఫంక్షన్‌లతో సహా వివిధ ఏఐ కెపాసిటీలను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్టుతో భారీ స్క్రీన్‌పై హై-రిజల్యూషన్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇంకా, ఈ టీవీ 20W ఆడియో అవుట్‌పుట్ 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

షావోమీ ఎఫ్ఎక్స్ ప్రో (రూ. 32,999) :
షావోమీ క్యూఎల్ఈడీ టీవీ ఎఫ్ఎక్స్ ప్రో 43-అంగుళాల మోడల్‌కు 30W ఆడియో అవుట్‌పుట్‌, 55-అంగుళాల మోడల్‌కు 34Wని అందిస్తుంది. డాల్బీ ఆడియోతో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఆప్షన్ కలిగి ఉంది. ఇంకా, ఈ టీవీ ఇంటర్నల్ ఫైర్ టీవీతో వస్తుంది. పేరెంట్ కంట్రోలింగ్‌తో పాటు 12,000+ యాప్‌లకు యాక్సెస్‌ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్, 32GB స్టోరేజీతో వస్తుంది.

ఎల్‌జీ QNED ఏఐ టీవీ (QNED8B) 139cm (రూ. 59,990) :
ఎల్‌జీ QNED ఏఐ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD డిస్‌ప్లే కలిగి ఉంది. క్లియర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. HDR10 ప్రో HLG సపోర్టుతో α7 AI ప్రాసెసర్ 4K జెన్8 ద్వారా పవర్ పొందుతుంది. webOS25పై రన్ అవుతుంది. ఏఐ పిక్చర్ ప్రో, ఏఐ సౌండ్ ప్రో, ఫిల్మ్‌మేకర్ మోడ్, ఏఐ బ్రైట్‌నెస్ కంట్రోల్ వంటి ఏఐ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇంకా, Wi-Fi 5 బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.

​లూమియో విజన్ 7 (రూ. 27,999) :
లూమియో విజన్ 7 డాల్బీ విజన్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K రిజల్యూషన్‌ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, ఈథర్నెట్, HDMI, USB, Wi-Fi ఆప్షన్ కలిగి ఉంది. ఈ టీవీ ఆపిల్ టీవీ, జియోహాట్‌స్టార్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లకు సపోర్టు ఇస్తుంది.