PM Kisan : పీఎం కిసాన్ 22వ వాయిదాపై బిగ్ అప్డేట్.. లక్షలాది మంది రైతుల పేర్లు తొలగింపు, మీ పేరు ఉందేమో చెక్ చేయండి
PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ 22 వాయిదా విడుదలకు ముందే లక్షలాది మంది అనర్హత గల రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ జాబితాలో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి.
PM Kisan Yojana 22nd Installment
- పీఎం కిసాన్ 22వ వాయిదాపై కీలక అప్డేట్
- లక్షలాది మంది రైతుల పేర్లను తొలగిస్తున్న కేంద్రం
- 22వ విడత రూ. 2వేలు రావాలంటే ఈ పనులు తప్పనిసరి
- తొలగింపు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని లక్షలాది మంది రైతులు 22వ వాయిదా డబ్బుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని 3 సమాన వాయిదాలలో అందిస్తోంది.
అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2వేలు చొప్పున జమ చేస్తుంది. ఇప్పటివరకు మొత్తంగా 21 వాయిదాలు విడుదల అయ్యాయి. పీఎం కిసాన్ 22వ విడత రావాల్సి ఉంది. ఇప్పటివరకూ ఈ వాయిదా తేదీపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
22వ విడత విడుదలకు ముందే, కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసింది. ఈ క్రమంలో లక్షలాది మంది అనర్హులైన లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించారు. మీరు కూడా 22వ విడత కోసం కూడా ఎదురుచూస్తుంటే.. మీ e-KYC, ల్యాండ్ సీడింగ్ విధానాలు పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీకు రావాల్సిన రూ. 2వేలు వాయిదా డబ్బులు నిలిచిపోతాయి.
పీఎం కిసాన్ నుంచి లక్షలాది మంది పేర్లు తొలగింపు :
ఈసారి, ప్రభుత్వం డేటా మ్యాచింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఫలితంగా వెరిఫికేషన్ సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. పథకం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం అందించిన అర్హత స్టేటస్ మారిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత జరిగిన భూమి బదిలీలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది కేంద్రం.
ఎందుకంటే.. మీ ల్యాండ్ డాక్యుమెంట్లు, పోర్టల్‌లో అందించిన సమాచారం సరిపోలకపోతే మీ కు రావాల్సిన వాయిదా నిలిచిపోవచ్చు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులను కూడా ఈ జాబితా నుంచి మినహాయించారు. తద్వారా అర్హత కలిగిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు.
e-KYC, ల్యాండ్ సీడింగ్ తప్పనిసరి :
పీఎం కిసాన్ 22వ వాయిదాను ఎలాంటి అంతరాయాలు లేకుండా పొందాలంటే కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. అందులో e-KYC ఒకటి. ఆధార్ ఓటీపీ లేదా బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేయవచ్చు. మీ స్టేటస్ ‘Yes’ అని చూపకపోతే, మీకు 22వ విడత రాదు.
అదేవిధంగా, ల్యాండ్ సీడింగ్ అంటే.. పోర్టల్‌లో మీ భూమి రికార్డులను అప్ డేట్ చేయడం తప్పనిసరి. ఇది ఒకవేళ ‘NO’ అని చూపిస్తే మీరు వెంటనే మీ లోకల్ తహసీల్ కార్యాలయాన్ని సంప్రదించాలి. మీ బ్యాంక్ అకౌంటును ఆధార్‌తో లింక్ చేయడం చాలా ముఖ్యం. ఆధార్ సీడింగ్ ఉంటేనే మీకు రూ. 2వేలు డీబీటీ ద్వారా మీ అకౌంట్లలో జమ అవుతాయి.
స్టేటస్ చెక్ ఎలా చేయాలంటే? :
మీరు 22వ విడతకు అర్హులో కాదో తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి మీ స్టేటస్ చెక్ చేయవచ్చు. ముందుగా, అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్, (pmkisan.gov.in)ని విజిట్ చేయండి. హోమ్‌పేజీ రైట్ సైడ్ ఉన్న ‘Farmer corner’ సెక్షన్ కింద, ‘Know Your Status’ ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- ‘Get Datta’ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ దరఖాస్తు పూర్తి వివరాలు కనిపిస్తాయి.
- e-KYC, ల్యాండ్ సీడింగ్ చెక్ చేయండి.
- గ్రీన్ టిక్ ఉంటే మీకు 22వ వాయిదా వస్తుంది
