Tejeswini : సినిమాల్లోకి బాలకృష్ణ రెండో కూతురు? స్పోర్ట్స్ డ్రామాతో అరంగేట్రం?
నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని (Tejeswini)సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Bala Krishna Daughter Tejeswini Nandamuri Should Make Her Film Debut
Tejeswini : నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సదరు వార్తల సారాంశం. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ప్రాజెక్టుకు సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశముందని అంటున్నారు.
ఈ చిత్రాన్ని సాధారణ కమర్షియల్ సినిమాలా కాకుండా, క్రీడా స్ఫూర్తితో పాటు సామాజిక సందేశాన్ని అందించేలా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అటు తేజస్విని గానీ అటు బాలయ్య గానీ ఎవరూ స్పందించలేదు.
Deepika Pilli : యాంకర్ దీపికా పిల్లి క్యూట్ ఎక్స్ప్రెషన్స్..
ఇటీవల తేజస్విని డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె సినీ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. గతంలో ఆమె ఓ ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆన్‌స్క్రీన్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Anchor Sreemukhi : బాల్టిమోర్‌లో చిన్నకోడలు.. యాంకర్ శ్రీముఖి ఫోటోలు వైరల్
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలయ్య మోకాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాలయ్య కోలుకుంటున్నారు. ఆయన కోలుకున్న అనంతరం NBK 111 షూటింగ్లో పాల్గొననున్నారు.
