Jio Recharge Plans : పండగ చేస్కోండి.. జియో బెస్ట్ రీఛార్జ్ వార్షిక ప్లాన్లు.. OTT బెనిఫిట్స్ కూడా.. 2026 ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు..!
Jio Recharge Plans : జియో యూజర్ల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. జియో అందించే ఈ వార్షిక ప్లాన్లతో ఓటీటీ బెనిఫిట్స్, జెమిని ఏఐ కూడా యాక్సస్ పొందవచ్చు..
Jio Recharge Plans
Jio Recharge Plans : జియో యూజర్లకు పండగే.. రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం అద్భుతమైన సరికొత్త వార్షిక ప్లాన్లను అందిస్తోంది. గత ఏడాదిలో రిలయన్స్ జియో రెండు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. లాంగ్ టైమ్ యూజర్లకు ఏడాది పొడవునా కనెక్టివిటీని అందిస్తుంది.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లు ఇప్పటికీ (Jio Recharge Plans) యాక్టివ్‌గా ఉన్నాయి, ఒకసారి రీఛార్జ్ చేయడం, నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ వార్షిక ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా అన్‌లిమిటెడ్ రోజువారీ డేటా (5G నెట్‌వర్క్‌లో), OTT యాక్సెస్ సహా మరికొన్ని అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ రెండు వార్షిక ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోండి.
రూ. 3,999 జియో వార్షిక ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? :
రూ.3,999 వార్షిక ప్యాక్ ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడిపేవారికి బెస్ట్. ఎక్కువ గంటలు వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్, రెగ్యులర్ బ్రౌజింగ్ కోసం రోజుకు 2.5GB డేటా సరిపోతుంది. అలాగే, రెండు OTT లకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ టీవీ షోలు, మూవీలు చూసేందుకు ఇష్టపడే యూజర్లకు కూడా బెస్ట్ ప్లాన్.
ఈ ప్యాక్ అసలు బెనిఫిట్ ఏంటంటే.. ఇందులో ఫ్యాన్‌కోడ్ ఉంటుంది. స్పోర్ట్స్ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేసే క్రీడా లవర్స్‌కు ఈ ప్లాన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రదేశాలలో ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5Gని కూడా అందిస్తుంది. ఏడాది పొడవునా స్ట్రీమింగ్, స్పీడ్ డౌన్‌లోడ్ అందిస్తుంది.
జియో వార్షిక ప్లాన్ రూ. 3,599 బెనిఫిట్స్ ఇవే :
రూ. 3,599 ప్లాన్ కూడా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ, 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. 2.5GB రోజువారీ డేటాతో వస్తుంది. స్పష్టమైన తేడా ఏమిటంటే.. డిజిటల్ పరంగా అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. ఫ్యాన్‌కోడ్‌కు బదులుగా గూగుల్ జెమినికి ప్రో యాక్సెస్ కలిగి ఉంటుంది.
పేమెంట్ సబ్‌స్ర్కిప్షన్ అనేది క్రియేటివిటీ వర్క్ చేసేవారు లేదా రీసెర్చ్, ఆఫీసు పనుల కోసం ఏఐ టూల్స్ వాడే యూజర్లకు ఈ వార్షిక ప్లాన్ బెస్ట్.. ఈ రీఛార్జ్ ప్యాక్‌లో మొత్తం రెండు OTT యాప్స్ ఉన్నాయి. అన్‌లిమిటెడ్ 5G సపోర్టును కూడా అందిస్తుంది. ఏదైనా ఇతర ఏఐ టూల్‌కు సబ్‌స్క్రైబ్ కోసం విడిగా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎంటర్ టైన్మెంట్ ప్రియులకు అద్భుతంగా ఉంటుంది.
జియో ఏ వార్షిక ప్లాన్ ఎంచుకోవాలి? :
జియో వార్షిక పాన్లలో ఏది ఎంచుకుంటారు అనేది మీ ఇష్టం. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ మీకు ముఖ్యమైతే రూ.3,999 రీఛార్జ్ ప్లాన్‌తో ఏ రోజునైనా తీసుకోవచ్చు. ఈ వార్షిక ప్లాన్ రూ. 3,599 ద్వారా జెమిని ఏఐ కూడా యాక్సెస్ పొందవచ్చు.
జియో వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ ఇలా :
2026 ఏడాది మొత్తం అంతరాయం లేని సర్వీసు కోరుకునే వినియోగదారులు డిసెంబర్ 31, 2025న రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, జియో యూజర్లు ఈ కచ్చితమైన తేదీకి కట్టుబడి ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏదైనా జియో నంబర్‌కు రీఛార్జ్ స్టాక్ అవుతుంది. ప్రస్తుత జియో ప్లాన్ గడువు ముగిసినప్పుడు మాత్రమే ప్రారంభమవుతుంది. అందుకే 2025 చివరి నాటికి ఏదైనా రీఛార్జ్ ఆటోమాటిక్‌గా 2026 చివరి వరకు వ్యాలిడిటీని పొడిగిస్తుంది. జియో కస్టమర్లు పూర్తి సంవత్సరం పాటు సర్వీసును ఎంజాయ్ చేయొచ్చు.
