Poco C85 Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. కొత్త పోకో C85 5G అదుర్స్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. మీ బడ్జెట్ ధరలోనే..!

Poco C85 Launch : పోకో నుంచి అద్భుతమైన 5జీ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమన్షిటీ 6300చిప్‌సెట్ కలిగి ఉంది. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

1/7Poco C85 Launch
Poco C85 Launch : కొత్త పోకో ఫోన్ వచ్చేసింది. షావోమీ సబ్-బ్రాండ్ పోకో C85 ఫోన్ లాంచ్ చేసింది. భారత మార్కెట్లో C సిరీస్‌ను కంపెనీ విస్తరించింది. ఈ కొత్త పోకో C85 5G ఫోన్ ఆకట్టుకునే ఆన్-పేపర్ స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. ధర కూడా రూ. 12,499 నుంచి ప్రారంభమవుతుంది.
2/7Poco C85 Launch
ఆసక్తిగల వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, పోకో ఇ-స్టోర్, ఇతర రిటైల్ ఛానెల్స్ నుంచి ఈ పోకో ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా HD+ ప్యానెల్‌ అందిస్తుంది. భారత మార్కెట్లో పోకో C85 ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి లుక్కేయండి..
3/7Poco C85 Launch
భారత్‌లో పోకో C85 ధర, లభ్యత : పోకో C85 ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499కు పొందవచ్చు. 6GB ర్యామ్, 128GB వేరియంట్ ధర రూ. 13,499, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499కు అందిస్తోంది.
4/7Poco C85 Launch
అయితే, లాంచ్ ఆఫర్ ప్రకారం.. 4GB, 6GB ర్యామ్ మోడల్స్ వరుసగా రూ. 11,999, రూ. 12,999 ధరలకు లభిస్తాయి. మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్ పవర్ బ్లాక్ వంటి 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, SBI నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
5/7Poco C85 Launch
పోకో C85 స్పెసిఫికేషన్లు : పోకో C85 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 810నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.9-అంగుళాల భారీ HD+ ప్యానెల్‌ను అందిస్తుంది. TÜV రైన్‌ల్యాండ్ లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్, ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ, డస్ట్, స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌ కూడా అందిస్తుంది.
6/7Poco C85 Launch
ఈ పోకో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOS 2.2పై రన్ అవుతుంది. ఈ పోకో ఫోన్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీని అందిస్తుంది.
7/7Poco C85 Launch
ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. ఈ పోకో ఫోన్ 50MP మెయిన్, QVGA సెకండరీ లెన్స్‌తో సహా డ్యూయల్ కెమెరాను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ పోకో ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ పోకో ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C, 3.5mm ఆడియో జాక్‌ను అందిస్తుంది.