Best Selling ACs 2025 : కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్‌లో అమ్ముడయ్యే టాప్ 10 బెస్ట్ ఏసీలు మీకోసం.. నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోండి!

Best Selling ACs 2025 : సమ్మర్ వచ్చేసింది. రానురాను ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఏసీలు కొనడం బెటర్.. అమెజాన్‌లో అమ్ముడయ్యే టాప్ 10 ఏసీల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Best Selling ACs 2025 : కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్‌లో అమ్ముడయ్యే టాప్ 10 బెస్ట్ ఏసీలు మీకోసం.. నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోండి!

Best Selling ACs 2025

Updated On : March 7, 2025 / 3:01 PM IST

Best Selling Air Conditioners : కొత్త ఏసీ కొంటున్నారా? అసలే సమ్మర్ సీజన్.. ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఏసీలు లేకుండా ఉండటం కష్టమే. అందుకే ఏసీలు కొనేందుకు మార్కెట్ వైపు ఆసక్తిగా చూపుతున్నారు. ఉక్కపోతలను తట్టుకోవాలంటే కచ్చితంగా ఇంట్లో ఏసీలు ఉండాల్సిందే మరి. మార్కెట్లో అనేక రకాల ఏసీలు ఉన్నాయి. ఏ ఏసీ కొంటే బెటర్ అనేది తేల్చుకోవడం కష్టమే. అందుకే మీకోసం టాప్ 10 ఏసీలను మీకోసం అందిస్తున్నాం.

ప్రస్తుతం ఈ టాప్ రేటింగ్ ఏసీలు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. డైకిన్ 1. 5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ నుంచి బ్లూ స్టార్ 1.5 టన్ 3 స్టార్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వరకు ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. మొత్తం టాప్ 10 ఏసీలలో మీకు నచ్చిన ఏసీని ఎంచుకుని కొని ఇంటికి తెచ్చుకోండి.. కొత్త ఏసీల ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Post Office Schemes : పోస్టాఫీస్‌లో 5 అద్భుతమైన స్కీమ్స్.. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే.. ఊహించని ప్రాఫిట్స్ పక్కా.. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా..!

1. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (MTKL50U, వైట్ కలర్ ) :
కొత్త ఏసీలో డైకిన్ 3స్టార్ రేటింగ్ కలిగి ఉంది. కాపర్ కండెన్సర్, పీఎం 2.5 ఫిల్టర్, ట్రిపుల్ డిస్‌ప్లే, డ్యూ క్లీన్ టెక్నాలజీ, కోండా ఎయిర్‌ఫ్లో ఉన్నాయి. ఈ 2024 మోడల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

2. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ (CS/CU-NU18ZKY5W, వైట్ కలర్ ) :
ఈ కొత్త ఏసీ 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. కాపర్ కండెన్సర్, 7-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ ఆప్షన్లు, ట్రూ ఏఐ, 4-వే స్వింగ్, పీఎం 0.1 ఫిల్టర్‌తో భారత ఫస్ట్ మ్యాటర్-ఎనేబుల్డ్ ఆర్ఏసీ 2024 మోడల్. ఈ ఏసీ వైట్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

3. హిటాచీ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (3400FXL RAS.G318PCBIBF, వైట్ కలర్ ) : 
హిటాచీ కొత్త ఏసీ 3 స్టార్ రేటింగ్ మాత్రమే కాదు.. ఐస్ క్లీన్, ఎక్స్‌ప్యాండబుల్ ప్లస్ టెక్నాలజీ, 100 శాతం కాపర్, డస్ట్ ఫిల్టర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ 2024 మోడల్ వైట్ కలర్ ఆప్షన్‌‌లో అందుబాటులో ఉంది.

4. డైకిన్ 0.8 టన్ 3 స్టార్ ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (FTL28U, వైట్ కలర్ ) :
కొత్త డైకిన్ ఏసీలో కాపర్ కండెన్సర్, పీఎం 2.5 ఫిల్టర్‌తో వస్తుంది. 3 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ 2022 మోడల్ కాగా, ప్రస్తుతం వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

5. లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (GLS18I3FWAGC, క్రోమ్ డెకో స్ట్రిప్‌ వైట్ ) :
కొత్త ఏసీలో 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్, కాపర్ కండెన్సర్, యాంటీ-వైరల్ ప్లస్ పీఎం 2.5 ఫిల్టర్‌ను అందిస్తుంది. ఈ లాయిడ్ 2023 మోడల్ క్రోమ్ డెకో స్ట్రిప్‌తో పాటు వైట్ కలర్
ఆప్షన్లను కలిగి ఉంది.

6. ఎల్‌జీ 1 టన్ 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (TS-Q13JNYE, వైట్ కలర్ మోడ్ ) : 
సరికొత్త ఎల్‌జీలో ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్, 4-వే స్వింగ్, యాంటీ-వైరస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. హెచ్‌డీ ఫిల్టర్, స్పీడ్ కూలింగ్, పవర్ సేవింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 2024 మోడల్ స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

7. క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏఐ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (CAI18ER3R34F0, వైట్ కలర్ ) :
కొత్త క్యారియర్ ఏసీలో కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్ ఆప్షన్లు ప్రధాన ఆకర్షణ. హై-డెన్సిటీ ఫిల్టర్, ఆటో క్లెన్సర్‌ను కలిగి ఉంది. ఈ 2024 మోడల్ ఏఐ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీగా చెప్పవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

8. గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (1.5T EI 18IINV5R32 WYS, వైట్ కలర్ ) :
ఈ ఏసీలో 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ ఆప్షన్లు, 52 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద హెవీ-డ్యూటీ కూలింగ్ మోడ్ ఉంది. 2024 మోడల్ అయిన గోద్రేజ్ ఏసీపై 5 ఏళ్ల వరకు వారంటీని అందిస్తుంది. వైట్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయొచ్చు.

Read Also : Gold Rates Today : బంగారం కొనడంలో మనమే టాప్.. ధరలు తగ్గడమే ఆలస్యం.. తెగ కొనేస్తున్నారు మనోళ్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

9. వర్ల్పూల్ 1.5 టన్ 3 స్టార్ ఫ్లెక్సీకూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (S3K1PPO, వైట్ కలర్ ఆప్షన్) :
ఈ కూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 4-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్, ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ కంప్రెసర్, వంద శాతం కాపర్ కండెన్సర్ కాయిల్ ఫీచర్లను కలిగి ఉంది.

10. బ్లూ స్టార్ 1.5 టన్ 3 స్టార్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (వైట్ కలర్ ) :
ఈ కొత్త ఇన్వర్టర్ ఏసీలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. మల్టీ-సెన్సార్‌లు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. సెల్ఫ్ లోడింగ్ ఆప్షన్, స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్‌ అందిస్తుంది. వైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.