Gold Rates Today : బంగారం కొనడంలో మనమే టాప్.. ధరలు తగ్గడమే ఆలస్యం.. తెగ కొనేస్తున్నారు మనోళ్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Gold Rates Today : బంగారం వినియోగంలో భారత్ ముందంజలో కొనసాగుతోంది. 563.5 టన్నుల బంగారం వినియోగంతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో నిలిచింది. చైనా రెండో స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Gold Rates Today : బంగారం కొనడంలో మనమే టాప్.. ధరలు తగ్గడమే ఆలస్యం.. తెగ కొనేస్తున్నారు మనోళ్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

India Surpasses China

Updated On : March 7, 2025 / 3:54 PM IST

Gold Rates Today : బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మళ్లీ తగ్గుతున్నాయి. పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి. ఇది రోజూ ఉండేది కదా. కానీ, బంగారం కొనేందుకు మన భారతీయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్కెటుతో సంబంధం లేకున్నా బంగారం కొనేవరకు ఆరాటపడుతూనే ఉంటారు.

అందులోనూ మహిళలు అయితే బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర ఏదైనా శుభాకార్యాలు ఉన్న రోజుల్లో అయితే మరి బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అంతగా మన భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోల్డ్ ఒక స్టేటస్ సింబల్ అయిందంటే అతిశయోక్తి కాదు. మనవాళ్లు బంగారానికి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు అలర్ట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే.. జీతం ఎంత పెరుగుతుందంటే? పూర్తి లెక్కలు మీకోసం..!

బంగారం వినియోగంలో భారత్ నెంబర్ వన్ :
భారత సంస్కృతి సంప్రదాయాలకు బంగారం ప్రతీకగా నిలిచింది. బంగారం అందరూ కొంటారు. కానీ, మన భారతీయులు కొన్నంత బంగారం ఇతర దేశాలు వరకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే మనదగ్గర ఆచార సంప్రదాయలకు పెట్టింది పేరు. అందుకే బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.

అదే మన దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. 2024 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశంగా భారత్ అవతరించింది. దాదాపు 563.5 టన్నుల బంగారాన్ని మనోళ్లు వాడేస్తున్నారు.

మూడో స్థానంలో అమెరికా :
తద్వారా ఇండియా బంగారం వినియోగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పక్క దేశమైనా చైనా 479.3 టన్నుల వినియోగంతో రెండో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా 132.1 టన్నుల బంగారంతో మూడో స్థానంలో నిలిచింది.

మనదేశంలో బంగారం అనేది కేవలం ధరించడానికి మాత్రమే కాదు.. పెట్టుబడులకు కూడా ప్రధాన వనరుగా ఉపయోగపడుతోంది. అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్లలో బంగారం హంగామా మామూలుగా ఉండదు. ఎన్నో తరాలుగా ప్రతి భారతీయులు బంగారాన్ని ప్రధాన పెట్టుబడివనరుగా భావిస్తున్నారు.

India Surpasses China

India Surpasses China

పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతిచోట బంగారం కొనడంలో ముందుంటున్నారు. బయటకు వెళ్తే ఏదైనా షాపింగ్ వెళ్లినా ఒంటి నిండా బంగారంతో వెళ్లాల్సిందే. బంగారం దగ్గర ఉంటే లోన్లు తీసుకోవచ్చు. అవసరమైతే పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని కొనేస్తున్నారు. కష్ట సమయాల్లో అదే బంగారం మనల్ని ఆదుకుంటుందని బలంగా నమ్ముతున్నారు.

భారత్ కన్నా అమెరికాలో తక్కువే :
భారత్ కన్నా చైనాలోనే బంగారానికి గిరాకీ ఎక్కువ. అయినప్పటికీ వినియోగంలో మాత్రం భారత్ ను మించలేకపోయింది. ఇప్పటికీ రెండో స్థానానికే పరిమితమైంది. అమెరికాలో అయితే బంగారానికి మార్కెట్ పరంగా ఫుల్ ఫుడ్ డిమాండ్ ఉంది. కానీ, వినియోగంలో మాత్రం భారత్ కన్నా తక్కువనే చెప్పాలి.

అందుకే బంగారం వినియోగంలో మూడో స్థానానికి అగ్రరాజ్యం పడిపోయింది. ఒక్క పెట్టుబడిలో మాత్రమే అమెరికా బలంగా ఉంది. మరోవైపు భారత్ బంగారం వినియోగంలో అంతే స్థాయిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే కొనసాగితే ఫ్యూచర్‌లో కూడా మనమే టాప్ ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

Read Also : Post Office Schemes : పోస్టాఫీస్‌లో 5 అద్భుతమైన స్కీమ్స్.. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే.. ఊహించని ప్రాఫిట్స్ పక్కా.. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా..!

దీనికి ప్రధాన కారణం మనదగ్గర ప్రతి శుభకార్యాలు, పండగల కోసం బంగారాన్ని తరచూ కొనుగోలు చేయడమే.. మార్కెట్లో బంగారం ధరలు పెరిగినా తగ్గినా సంబంధం లేదు. బంగారం ఎంతైనా కొనేందుకు చాలామంది వెనుకడటం లేదు. రానున్న రోజుల్లో బంగారం లక్ష దాటే అవకాశం కనిపిస్తోంది.

అదేగానీ జరిగితే భారత్‌లో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ, భారతీయులకు బంగారం అంటే మక్కువతో పాటు దేశీయ సంప్రదాయం కారణంగా పసిడి వినియోగంలో తగ్గే పరిస్థితి ఉండకపోవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.