8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు అలర్ట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే.. జీతం ఎంత పెరుగుతుందంటే? పూర్తి లెక్కలు మీకోసం..!
8th Pay Commission Salary : 8వ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంత ప్రయోజనం పొందుతారో ఫిట్‌మెంట్ అంశం ఆధారంగా నిర్ణయిస్తారు.

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుత 7వ పే కమిషన్ పదవీకాలం డిసెంబర్ 31, 2025 తో ముగియనుంది. అందరూ ఊహించినట్టుగా కొత్త వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
ఎప్పటినుంచో ఉద్యోగులు, పెన్షర్లు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ, ఇంకా కమిషన్ ఏర్పాటు కాలేదు.
అయినప్పటికీ, 8వ వేతన సంఘం ఏర్పడి, సిఫార్సులను అమలు చేశాక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీ మొత్తంలో పెరుగుదల ఉండవచ్చునని తెగ చర్చించుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ కూడా లేకపోలేదు.. 8వ వేతన సంఘం ద్వారా జీతం పెంపునకు ఫిట్‌మెంట్ అంశం 2.28 నుంచి 2.86 మధ్య ఉంటుందని అంచనా వేయడమే.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కనీస వేతనాన్ని లెక్కిస్తారు. గతంలో 7వ వేతన సంఘం (7వ వేతన సంఘం)లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. 6వ వేతన సంఘం (6వ CPC)లో 1.86గా ఉండేది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.28 నుంచి 2.86 మధ్య ఉండవచ్చునని అంచనా.
జీతాలు ఎంత పెరగవచ్చు? :
8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే.. ఉద్యోగుల కనీస వేతనం 40 శాతం నుంచి 50 శాతం పెరుగుతుంది. ఉద్యోగి ప్రస్తుత కనీస వేతనం రూ. 20వేలుగా ఉంటే.. 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కొత్త జీతం (రూ. 20వేలు × 2.86 = రూ. 57,200 ) ఉంటుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 వద్ద నిర్ణయిస్తే.. కనీస వేతనం, పెన్షన్ పెరుగుదల ఇలా ఉండొచ్చు.
ప్రస్తుత కనీస వేతనం : రూ. 18వేలు
కొత్త కనీస వేతనం : రూ. 18వేలు × 2.86 = రూ. 51,480
ప్రస్తుత కనీస పెన్షన్ : రూ. 9వేలు
కొత్త కనీస పెన్షన్ : 9వేలు × 2.86 = రూ. 25,740
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కనీస వేతనం రూ.40వేలు అనుకుంటే.. కొత్త కనీస వేతనం 2.28 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా రూ.91,200కి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త బేసిక్ పేలో 70 శాతంగా డియర్‌నెస్ అలవెన్స్ నిర్ణయిస్తే.. అప్పుడు డీఏ రూ.63,840 అవుతుంది. కొత్త బేసిక్ పేలో 24 శాతంగా ఉన్న హెచ్‌ఆర్‌ఏ రూ.21,888 అవుతుంది. బేసిక్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపితే, మొత్తం జీతం దాదాపు రూ. లక్షా 76వేలు అవుతుంది.
జీతాలపై ప్రభావం పడే ఛాన్స్ :
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో అనేక మార్పులు రావొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం 25 శాతం నుంచి 30శాతం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. అలవెన్సులు, పర్ఫార్మెన్స్ శాలరీ సైతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, 8వ వేతన సంఘం అమలుపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన కమిషన్‌ను ఏర్పాటు చేయగానే ఆయా బెనిఫిట్స్ లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తాయి.