SSY Scheme : ఆడపిల్ల పుట్టగానే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పెళ్లినాటికి రూ.70 లక్షలు చేతికి అందుతాయి.. ఫుల్ డిటెయిల్స్
SSY Scheme : మీ కుమార్తె 10 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడే సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టండి. ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడబిడ్డల భవిష్యత్తును కోసం తీసుకొచ్చింది.

SSY Scheme
SSY Scheme : ఆడపిల్ల పుట్టగానే ప్రతి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి అనేక కలలు కంటారు. వారికి మంచి చదువుతో పాటు మంచి కుటుంబానికి పెళ్లి చేసి పంపించాలని భావిస్తుంటారు. అయితే, కూతురు పుట్టినప్పుడే వారి కోసం డబ్బులు రూపాయి రూపాయి కూడబెడుతుంటారు.
ఆడపిల్ల ఎదిగే కొద్ది వారి చదువుకు లేదా పెళ్లినాటికి డబ్బులు చేతికి వస్తాయని అనుకుంటారు. అలాగే, మీరు కూడా మీ కుమార్తె 10 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉంటే.. మంచి ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంలో పెట్టుబడితో మీ కలలను సాకారం చేసుకోవచ్చు.
ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం తీసుకొచ్చింది. ఈ పథకం చాలా మంది తల్లిదండ్రులకు ఆశాకిరణంగా మారింది. మీరు ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కుమార్తె పెళ్లినాటికి దాదాపు రూ.70 లక్షలు చేతికి అందుతాయి. మీకు లేదా మీ కూతురికి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు మీరు ఈ రూ. 70 లక్షల మొత్తాన్ని తీసుకోవచ్చు.
ఈ ఖాతాను కుమార్తె పుట్టిన సమయంలో ఓపెన్ చేస్తే.. 21 ఏళ్లు నిండగానే పథకం ద్వారా మెచ్యూరిటీ పొందవచ్చు. ఇంతకీ ఈ ఎస్ఎస్‌వై పథకం ఎలా పనిచేస్తుంది? ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మొత్తంలో డబ్బు వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
SSY అకౌంట్ ప్రత్యేకతలివే :
- ఈ పథకం కింద 10 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు కలిగిన ఆడపిల్లల పేరు మీద ఖాతా ఓపెన్ చేయొచ్చు.
- ఒక ఆర్థిక సంవత్సరంలో SSY ఖాతాలో కనీసం రూ.250 లేదా గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేయొచ్చు.
- ఈ ఖాతాకు 8.2 శాతం వార్షిక వడ్డీ వస్తుంది.
- బ్యాంకులు, పోస్టాఫీసులలో ఖాతాను ఓపెన్ చేయొచ్చు.
- ఖాతా ఓపెన్ చేసిన 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పొందవచ్చు.
- 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి చేయాలి.
- ఈ ఖాతాను దేశంలోని బ్యాంకులు, పోస్టాఫీసుల మధ్య బదిలీ పెట్టుకోవచ్చు.
- SSY ఖాతా కింద వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితం.
- జమ చేసిన మొత్తం డబ్బుపై సెక్షన్ 80-C కింద మినహాయింపు పొందవచ్చు.
SSY పథకంలో ప్రత్యేకతలివే :
సుకన్య సమృద్ధి యోజనలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అకౌంట్ 21 ఏళ్లుక మెచ్యూరిటీ అవుతుంది. కానీ, ఈ పథకంలో 15 సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మెచ్యూరిటీ వరకు అనగా.. 21 సంవత్సరాల వరకు మొత్తం అమౌంటుపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది.
మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 3 వేర్వేరు స్థాయిలలో పన్ను మినహాయింపును పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత, పెట్టుబడిపై వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. మూడోది మెచ్యూరిటీ సమయంలో వచ్చే డబ్బుపై కూడా పన్ను ఉండదు.
SSY కాలిక్యులేటర్ ప్రకారం.. మీకు ఎంత డబ్బు వస్తుందంటే? :
- SSY అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం : 2025
- అకౌంట్ మెచ్యూరిటీ సంవత్సరం : 2046
- ప్రస్తుత SSY వడ్డీ రేటు : సంవత్సరానికి 8.2 శాతం
- ప్రతి నెలా పెట్టుబడి : రూ. 12,500 (వార్షిక పెట్టుబడి రూ. 1.50 లక్షలు)
- 15 ఏళ్లలో పెట్టుబడి మొత్తం : రూ. 22,50,000
- పెట్టుబడిపై మొత్తం వడ్డీ : రూ. 46,82,648
- 21 ఏళ్లలో మెచ్యూరిటీపై అందుకున్న మొత్తం : రూ. 69,32,648
మధ్యలోనే విత్‌డ్రా చేసుకోవచ్చా? :
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద మీ కూతురికి 18 ఏళ్లు నిండాక ఆమె పెళ్లికి 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మీ డబ్బును విత్ డ్రా చేయొచ్చు. అకౌంట్ కలిగిన వ్యక్తి ఆకస్మిక మరణం, అమ్మాయి సంరక్షకుడి మరణం, ఖాతాదారుడికి తీవ్రమైన అనారోగ్యం వంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవచ్చు.