Personal Finance : కేవలం రూ. 250 పెట్టుబడితో లక్షలు సంపాదించిపెట్టే సూపర్ స్కీమ్స్ ఇవే.. భవిష్యత్తులో డబ్బుకు డోకా ఉండదు!
Personal Finance : డబ్బు ఎంత సంపాదించినా మిగలడం లేదా? వెంటనే ఖర్చు అయిపోతుందా? మీరు నెలకు కేవలం 250 రూపాయలు పెట్టుబడి పెట్టండి. తద్వారా లక్షల రూపాయల వరకు ఆదా చేయొచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Best Investment Schemes
Personal Finance : భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? తక్కువ మొత్తంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతైమన దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్కువ మొత్తంలో డబ్బుతో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
కాలక్రమేణా మీరు లక్షల రూపాయలు కూడబెట్టుకోవచ్చు. కేవలం రూ.250తో పెట్టుబడి ప్రారంభించాలి. దీర్ఘకాలంలో లక్షల రూపాయలను సంపాదించవచ్చు. రోజువారీ ఆదాయంపై ఆధారపడిన వారు లేదా నెలలో రూ. 5 వేల నుంచి రూ.10 వేల రూపాయలు సంపాదించలేని వారు కూడా ఈ పథకాలలో సులభంగా డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అలాంటి కొన్ని ఆకర్షణీయమైన పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం :
మీ కూతురి భవిష్యత్తు లేదా పెళ్లినాటికి డబ్బు అందాలంటే.. మీరు సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో రూ. 250 నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇందులో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. పథకం 21 ఏళ్లలో మెచ్యూరిటీ పొందుతుంది.
ప్రస్తుతం ఈ పథకం 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. మీరు నెలకు రూ. 250 పెట్టుబడి పెట్టినా ఒక ఏడాదిలో రూ. 3వేల పెట్టుబడి పెడతారు. 15 ఏళ్లలో మొత్తం రూ. 45వేలు పెట్టుబడి పెడతారు. 8.2శాతం రేటుతో మీకు వడ్డీగా రూ. 93,552 లభిస్తుంది. ఈ విధంగా, నెలకు కేవలం రూ. 250 డిపాజిట్ చేయడం ద్వారా మీ కూతురి పెళ్లినాటికి లేదా చదువు కోసం మొత్తం రూ. 1,38,552 సేవింగ్ చేయవచ్చు.
ఎస్ఐపీ (SIP) :
మీరు కోరుకుంటే.. మీరు SIPలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇటీవలే ఎస్బీఐ ఒక కొత్త ఎస్ఐపీ పథకాన్ని ప్రారంభించింది. మీరు కేవలం రూ. 250 నుంచి ఇందులో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇంతకీ ఆ పథకం పేరు ఏంటంటే.. జాన్ నివేష్ ఎస్ఐపీ (JanNivesh SIP). మీరు నెలకు రూ. 250 చొప్పున డిపాజిట్ చేయాలి.
ఈ పెట్టుబడిని 20 ఏళ్లు కొనసాగిస్తే రూ. 60వేలు పెట్టుబడి పెడతారు. 12 శాతం రాబడి ప్రకారం లెక్కిస్తే.. మీకు వడ్డీగా రూ.1,89,786 లభిస్తుంది. తద్వారా సులభంగా మొత్తం రూ. 2,49,786 లక్షల డబ్బులను కూడబెట్టవచ్చు.
Read Also : Astro Tips : మీకు నిరుద్యోగ సమస్యలా? ఈ 7 పరిహారాలు చేయండి చాలు.. మీరు కోరుకున్న జాబ్ వస్తుంది..!
రికరింగ్ డిపాజిట్ (RD) :
రికరింగ్ డిపాజిట్ అనేది పిగ్గీ బ్యాంకు లాంటిది. ఈ స్కీమ్ బ్యాంకులు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉంది. పోస్టాఫీసులో RD స్కీమ్ కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడిని కేవలం రూ. 100తో ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం 6.7శాతం రేటుతో వడ్డీని అందిస్తోంది. మీరు నెలకు రూ. 250 డిపాజిట్ చేసినా, 5 ఏళ్లలో మొత్తం రూ. 15వేలు పెట్టుబడి పెడితే 6.7శాతం వడ్డీ రేటుతో రూ. 2,841 వడ్డీ పొందుతారు. తద్వారా మీకు రూ. 17,841 వడ్డీ జమ అవుతుంది.