Elon Musk : మస్క్ మామకు బిగ్ షాక్.. అంతరిక్షంలో పేలిన స్టార్‌షిప్ రాకెట్.. భూమిపైకి దూసుకొచ్చిన శకలాలు.. వీడియో వైరల్
Elon Musk Starship 8 : స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ 8 రాకెట్ ప్రయోగ సమయంలో అంతరిక్షంలో పేలిపోయింది. శిధిలాలు బహామాస్ సమీపంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ మార్గంలో వెళ్లే విమాన సర్వాసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

Elon Musk's Starship 8 Blows Up Over Bahamas, Flight Diversions
Elon Musk : ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలన్ మస్క్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కంపెనీ స్పేస్‌ఎక్స్ ప్రయోగం విఫలమైంది. స్పేస్ఎక్స్ ప్రయోగించిన కొద్ది నిమిషాలకే నియంత్రణ కోల్పోయి అంతరిక్షంలో స్టార్‌షిప్ రాకెట్ పేలిపోయింది.
ఆకాశంలో ఒక్కసారిగా పేలిన రాకెట్ శిథిలాలు దక్షిణ ఫ్లోరిడా, బహామాస్ సమీపంలోని పెద్ద ప్రాంతంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కరేబియన్ ప్రాంతంలో పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది.
Read Also : Apple iPhone 14 : బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14పై ఏకంగా రూ.51వేలు డిస్కౌంట్.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!
స్టార్‌షిప్ అంతరిక్షంలో విడిపోయిన తర్వాత ఇంజిన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొద్దిసేపటికే స్టార్‌షిప్ పేలి భూమివైపు శిథిలాలు దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 403 అడుగుల పొడవు (123 మీటర్లు) ఉన్న ఈ రాకెట్ సూర్యాస్తమయానికి ముందు టెక్సాస్ నుంచి టేకాఫ్ అయింది.
మొదటి దశలోనే స్పేస్‌ఎక్స్ విజయవంతంగా బయలుదేరింది. కానీ, అంతరిక్ష నౌక ముందుగా నిర్దేశించిన మార్గాన్ని కొనసాగలేదు. మధ్యలోనే నియంత్రణ కోల్పోయిందని స్పేస్‌ఎక్స్ తెలిపింది. హిందూ మహాసముద్రం మీదుగా చాలా దూరం వెళ్లిన తర్వాత స్పేస్ఎక్స్ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి.
స్టార్‌షిప్ 8 క్రాష్ వీడియో వైరల్ :
స్పేస్‌ఎక్స్ లైవ్ స్ట్రీమ్‌లో స్టార్‌షిప్ శిథిలాలు అంతరిక్షంలో నుంచి భూ వాతావరణంలోకి దూసుకురావడం రికార్డు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో అంతరిక్ష నౌక శిథిలాలు ఆకాశంలో అగ్నిగోళాల మాదిరిగా భూ వాతావరణంలోకి దూసుకుపోతున్నట్లు కనిపించాయి. అంతరిక్ష ప్రయోగ శిథిలాల కారణంగా మయామి, ఫోర్ట్ లాడర్‌డేల్, పామ్ బీచ్, ఓర్లాండో విమానాశ్రయాలలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
BREAKING: SpaceX Starship exploded and fell apart over the Bahamas. pic.twitter.com/XEpThriQmW
— Ankush sharma (@Aku_700) March 7, 2025
స్పేస్‌ఎక్స్ ఏం చెప్పిందంటే? :
మిషన్ విఫలమైన తర్వాత స్పేస్‌ఎక్స్ అధికారిక ప్రకటన చేసింది. ‘స్టార్‌షిప్ అంతరిక్షంలోకి ప్రవేశించగానే ఊహించని విషయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్టార్‌షిప్ 8 ముందుగా నిర్ణయించిన మార్గంలో వేగంగా వెళ్లలేకపోయింది. దాంతో స్టార్‌షిప్ నియంత్రణ కోల్పోయింది. ప్రయోగం విఫలం కావడానికి అసలు కారణాన్ని అర్థం చేసుకునేందుకు ట్రయల్ డేటాను సమీక్షిస్తున్నాం’ అని పేర్కొంది. స్టార్‌షిప్ మిషన్ విఫలం మరో చేదు అనుభవం. ఓటమి ఎన్నో పాఠాలను నేర్పుతుంది.
రెండు నెలల్లో స్టార్‌షిప్‌కి ఇది రెండో వైఫల్యం. జనవరి ప్రారంభంలో కంపెనీ ప్రయోగం విఫలమైంది. రాకెట్ మండుతున్న శిథిలాలు టర్క్స్, కైకోస్ దీవులపై పడ్డాయి. మాక్ శాటిలైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు స్పేస్‌ఎక్స్ ఒక భారీ స్టార్‌షిప్ రాకెట్‌ను టెస్టింగ్ విమానంలో ప్రయోగించింది.