Post Office Schemes : పోస్టాఫీస్‌లో 5 అద్భుతమైన స్కీమ్స్.. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే.. ఊహించని ప్రాఫిట్స్ పక్కా.. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా..!

Post Office Schemes : పోస్ట్ ఆఫీస్ పథకాలతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. పోస్టాఫీసులో అందించే 5 అద్భుతమైన పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Schemes : పోస్టాఫీస్‌లో 5 అద్భుతమైన స్కీమ్స్.. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే.. ఊహించని ప్రాఫిట్స్ పక్కా.. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా..!

Post Office Schemes

Updated On : March 7, 2025 / 1:38 PM IST

Post Office Schemes : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయా? అని ఆరా తీస్తున్నారా? అయితే, మీకోసం పోస్టాఫీస్‌‌లో చిన్నమొత్తంలో సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పన్ను ఆదాతో పాటు ప్రభుత్వ హామీని కూడా అందిస్తాయి.

ఈ పథకాలలో పెట్టుబడులతో వచ్చే రాబడి రెండూ ప్రభుత్వమే హామీగా ఉంటుంది. అందుకే, ఈ పథకాలు రిటైల్ పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరమని చెప్పవచ్చు. అలాగే, ఈ పోస్టాఫీసు పథకాల ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ అందించే 5 బెస్ట్ స్కీమ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : SSY Scheme : ఆడపిల్ల పుట్టగానే ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. పెళ్లినాటికి రూ.70 లక్షలు చేతికి అందుతాయి.. ఫుల్ డిటెయిల్స్

1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :
దేశంలో పాపులర్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు. దీనిపై వచ్చే రాబడిపై కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ మొత్తం పెట్టుబడిపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై కూడా పన్ను ఉండదు. వాస్తవానికి, మినహాయింపు కేటగిరీలో ఎంపిక చేసిన పథకాలలో ఇదొకటి. పెట్టుబడి, వడ్డీపై ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు అందించే పథకాలుగా చెప్పవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణయిస్తారు. ప్రస్తుతం, ఈ వడ్డీ రేటు జనవరి నుంచి మార్చి 2025 త్రైమాసికానికి 7.1శాతంగా ఉంది.

2. సుకన్య సమృద్ధి యోజన (SSY) :
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఆడబిడ్డల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. ఇందులో పన్ను మినహాయింపు మాత్రమే కాదు.. అధిక రాబడి పొందవచ్చు. ఈ పథకం కింద ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఇందులో పెట్టుబడికి 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితంగానే ఉంటాయి. పీపీఎఫ్ మాదిరిగానే ఈ స్కీమ్ కూడా (EEE) కేటగిరీ కిందకు వస్తుంది. మీరు గానీ ఇందులో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనపై 8.2శాతం వడ్డీ రేటుకు అందిస్తోంది.

3. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) :
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్థిరమైన రాబడిని అందించే ఇన్వెస్టింగ్ స్కీమ్. హామీతో పాటు రాబడిని పొందవచ్చు. పన్ను ఆదా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు.

సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ పథకంలో మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ఉంటుంది. అయితే, ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ప్రస్తుతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంతో సంవత్సరానికి 7.7శాతం వడ్డీని పొందుతోంది. మెచ్యూరిటీ ఆధారంగా చెల్లిస్తారు.

4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) :
సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అద్భుతమైన స్కీమ్. వృద్ధుల కోసమే ప్రత్యేకంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన పథకంగా చెప్పవచ్చు. పెట్టుబడితో ఎక్కువ వడ్డీని పొందవచ్చు.

కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ, దీనిపై వచ్చే వడ్డీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.

5. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (POTD) :
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (POTD) పథకంలో 5 ఏళ్ల కాలానికి పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, స్వల్పకాలిక పెట్టుబడులపై ఎలాంటి పన్ను ప్రయోజనం ఉండదు. ఇందులో కనీసం రూ. వెయ్యి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు అలర్ట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే.. జీతం ఎంత పెరుగుతుందంటే? పూర్తి లెక్కలు మీకోసం..!

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని గమనించాలి. ఈ పథకంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.5శాతంగా ఉంది.

ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ కోరుకునే పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్. ఈ పథకాల్లో పెట్టుబడితో స్థిరమైన రాబడి పొందవచ్చు. అలాగే, ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. మీరు పన్ను ఆదాతో పాటు సురక్షితమైన పెట్టుబడిని పొందవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి పథకాల గురించి పూర్తి వివరాలను తెలుసుకోండి.