Top 5 Family Scooters : బైకుల కన్నా స్కూటర్లే బెటర్.. ట్రాఫిక్‌లో టెన్షన్ లేదు.. ఫ్యామిలీలు తెగ కొనేస్తున్న టాప్ 5 స్కూటర్లు ఇవే!

Top 5 Family Scooters : స్టైలిష్ ఫ్యామిలీ స్కూటర్ కోసం చూస్తున్నారా? బైకుల కన్నా అద్భుతమైన ఫీచర్లతో ఏథర్, టీవీఎస్, హోండా వంటి బ్రాండ్‌ల నుంచి కొన్ని బెస్ట్ స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది కావాలో ఎంచుకోండి.

Top 5 Family Scooters

  • కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా?.. ముందు ఈ టాప్ 5 మోడల్స్ చూసేయండి
  • మధ్యతరగతి ఫ్యామిలీల ఫేవరెట్ స్కూటర్లు.. ధర, మైలేజ్ రెండూ సూపర్
  • కిరాణా సామాను కొనడం నుంచి ఆఫీసు ప్రయాణాల వరకు స్కూటర్లకే డిమాండ్

Top 5 Family Scooters : ఫ్యామిలీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బైక్ కొనాలా? స్కూటర్ కొనాలా? ఏది కొంటే బెటర్? అని ఆలోచిస్తున్నారా? ప్రత్యేకించి నగర ప్రయాణాలకు రెండింటిలో ఏది బెటర్? చాలామంది బైకుల కన్నా స్కూటర్లకే సై అంటారు. ఎందుకంటే.. కిరాణా సామాగ్రి నుంచి ఇతర లగేజీలను ఈజీగా క్యారీ చేయొచ్చు. దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఫ్యామిలీలకు స్టైలిష్ మోడ్రాన్ ఆప్షన్లుగా మారాయి.

ఇంధన ధరలు పెరగడం, యాజమాన్య ఖర్చుల కారణంగా చాలా మంది భారతీయ (Top 5 Family Scooters) కొనుగోలుదారులు ఇప్పుడు సాంప్రదాయ కమ్యూటర్ బైకులను పక్కన పెట్టేస్తున్నారు. అధిక ఇంధన సామర్థ్యంతో రద్దీగా ఉండే సందులలో కూడా ఈజీగా ప్రయాణించగల స్కూటర్లనే ఎంచుకుంటున్నారు. కిరాణా సామాను కొనుగోలు నుంచి ఆఫీసు ప్రయాణాల వరకు, స్కూటర్లను చాలా మంది ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

ప్రత్యేకించి నగర ప్రయాణికుల కోసం బైక్‌ల కన్నా అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునే టాప్ 5 ఫ్యామిలీ స్కూటర్లను మీకోసం అందిస్తున్నాం. బైక్ నుంచి స్కూటర్లకు మారాలని ప్లాన్ చేస్తుంటే ఇందులో మీకు నచ్చిన స్కూటర్ ఇంటికి తెచ్చుకోండి.

ఏథర్ రిజ్టా (ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు) :
ఫ్యామిలీ కస్టమర్లకు ఏథర్ రిజ్టా స్కూటర్ అద్భుతంగా ఉంటుంది. స్టైల్, సౌకర్యం, ప్రాక్టికాలిటీ విషయంలో అసలు రాజీ పడాల్సిన పనిలేదు. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత విశాలమైన సీట్లలో రిజ్టా ఒకటి. ఎక్కువ స్టోరేజ్ స్పేస్ కనెక్టెడ్ టెక్ ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి రేంజ్ 159 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 2.9kWh, 3.7 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

Read Also : Carrymen Assistant : భర్తలకు, తల్లులకు బిగ్ రిలీఫ్.. మీరు షాపింగ్ చేయండి.. మీ లగేజీని మోసే అసిస్టెంట్ వచ్చేసింది!

హీరో డెస్టిని 125 (ప్రారంభ ధర రూ. 77,888) :
సౌకర్యవంతమైన ప్రయాణం, సరసమైన ధర, సింపుల్ లుక్ కోరుకునే భారతీయ కొనుగోలుదారుల కోసం హీరో డెస్టిని 125 అదిరే స్కూటర్. సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, ఇంధన సామర్థ్యం బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 125cc ఇంజన్, ఫ్యామిలీ కస్టమర్లకు నగరంలో ట్రాఫిక్‌ ప్రయాణాలకు అద్భుతంగా ఉంటుంది.

హోండా డియో 110 (ప్రారంభ ధర రూ. 70,309) :
హోండా నుంచి డియో స్కూటర్ అద్భుతంగా ఉంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు బెస్ట్ స్కూటర్. ఈ టీవీలర్ లైట్ ఇంజన్, కాంపాక్ట్ కొలతలు, ఫీచర్లు, అదిరే డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త వెర్షన్‌లో అప్‌డేట్ స్టైలింగ్, మోడ్రాన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ 110cc స్కూటర్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఫ్యూయిల్ సేవ్ చేస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

సుజుకి యాక్సెస్ 125 (ప్రారంభ ధర రూ. 86,326) :
ఈ సుజుకి యాక్సెస్ 125 ట్రిమ్ ఆప్షన్లు, టీఎప్టీ కన్సోల్‌తో భారత మార్కెట్లో మోస్ట్ ఫ్యామిలీ స్కూటర్‌గా నిలిచింది. 124cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ స్మూత్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. నగర ప్రయాణాలకు అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.

టీవీఎస్ జూపిటర్ (ప్రారంభ ధర రూ. 73,550) :
టీవీఎస్ జూపిటర్ ఫ్యామిలీ మెచ్చిన స్కూటర్‌. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కనెక్టింగ్ ఫీచర్లు, సేఫ్టీ కారణంగా ఈ స్కూటర్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ టీవీఎస్ ​​స్కూటర్ విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్, ఫ్యూయిల్ సేవ్ చేసే ఇంజిన్‌ అందిస్తుంది. ఈ ప్యాకేజీకి మరింత ప్రీమియం స్టైలింగ్, సౌకర్యాన్ని అందిస్తుంది.