Top 5 Upcoming Cars : SUV మార్కెట్‌కు కొత్త కింగ్స్.. మారుతి నుంచి హ్యుందాయ్ వరకు రాబోయే టాప్ 5 మాస్ కార్లు!

Top 5 Upcoming Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లోకి మారుతి నుంచి హ్యుందాయ్ వరకు అద్భుతమైన SUV మోడల్ కార్లు రాబోతున్నాయి. ఇందులో SUV మోడళ్లు, ఎలక్ట్రిక్ కార్లు ఉంటాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

Top 5 Upcoming Cars ( Image Credit : AI )

  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో లాంచ్ కానున్న 5 కార్లు
  • మారుతి నుంచి హ్యుందాయ్ వరకు సరికొత్త మోడళ్లు
  • భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్

Top 5 Upcoming Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ SUV కార్లు రాబోతున్నాయి. టాప్ ఆటో దిగ్గజ కంపెనీలు కొత్త మోడళ్లతో మార్కెట్ ఫుల్ బిజీగా మారనుంది. ఇందులో మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ (Top 5 Upcoming Cars) మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో SUVలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. రాబోయే కార్లలో చాలా వరకు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనే ఉంటాయి. మొత్తం కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా భారీగా పెరుగుతూనే ఉంది. ఈ లాంచ్‌లలో ఈవీ మోడళ్లు ఎక్కువగా ఉండొచ్చు. భారత మార్కెట్లోకి రాబోయే ఎస్ యూవీ కార్లలో మారుతి సుజుకి, మహీంద్రా, టాటా, హ్యుందాయ్, కియా లాంచ్ చేయబోయే టాప్ 5 SUV మోడళ్లను ఇప్పుడు పరిశీలిద్దాం..

మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ :
మారుతి సుజుకికి రాబోయే ఏడాది చాలా బిజీగా ఉండబోతోంది. ఈ కంపెనీ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లు, కొత్త జనరేషన్ వెర్షన్‌లు, సరికొత్త మోడళ్లతో సహా అనేక మోడళ్లను లాంచ్ చేయనుంది. ఇందులో బాలెనో ఫేస్‌లిఫ్ట్, కొత్త జనరేషన్ వాగన్ఆర్, సరికొత్త 3 వరుసల SUV ఉంటాయి. అందులో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి SUV కారు కూడా ఒకటి.

ఇందులో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేకంగా ఉంటుంది. టాటా నెక్సాన్ నుంచి తీవ్రమైన పోటీ కారణంగా బ్రెజ్జా అమ్మకాలు తగ్గాయి. కొత్త బ్రెజ్జా కచ్చితంగా కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. 2026 బ్రెజ్జాలో ఎక్స్ ట్రనల్, ఇంటర్నల్ డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉండవచ్చని అంచనా.

Read Also : Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫ్యాన్స్‌కు జాక్‌పాట్.. ప్రీమియం ఫోన్ ఇప్పుడు చీప్ రేటుకే.. రూ. 20వేలు డిస్కౌంట్..!

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ :
భారత మార్కెట్లో మహీంద్రా అత్యధికంగా అమ్ముడయ్యే మూడు-వరుసల SUV కార్లలో స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఒకటి. ఈ ఏడాది రెండో లేదా మూడో త్రైమాసికంలో లాంచ్ కానుంది. డిజైన్‌లో కొన్ని చిన్న మార్పులతో రానుంది. కానీ, ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు ఉండదు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ అల్కాజర్, ఎంజి హెక్టర్ ప్లస్‌లకు పోటీగా నిలవనుంది.

టాటా సియెర్రా ఈవీ :
టాటా గత ఏడాదిలో సియెర్రా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్‌ లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆ కంపెనీ ఈ SUV ఈవీ వెర్షన్‌ కూడా లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అదే.. టాటా సియెర్రా ఈవీ కారు. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ కారు లాంచ్ కానుంది.

చాలా టాటా ఈవీలు ఐసీఈ వెర్షన్‌ల మాదిరిగానే డిజైన్‌తో వచ్చాయి. రాబోయే ఈ చిన్న ఈవీ కొన్ని మార్పులతో అదే డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. టాటా సియెర్రా ఈవీ సింగిల్ ఛార్జ్‌పై సుమారు 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని అంచనా. మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఇ-విటారాలకు పోటీగా నిలుస్తుంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీ :
హ్యుందాయ్ ఈ ఏడాదిలో 2 కొత్త SUV కార్లను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అందులో ICE-పవర్డ్ మిడ్-సైజ్ SUV ఒకటి. మరొకటి దేశీయంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ SUV.ఇప్పటికే క్రెటా మిడ్-సైజ్ SUV కూడా ఉంది. రెండో మిడ్-సైజ్ SUV రాకతో మరింత అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీ వద్ద క్రెటా ఎలక్ట్రిక్ అయోనిక్ 5 ఉన్నా అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీలకు పోటీగా నిలవనుంది.

కియా సెల్టోస్ ఈవీ :
భారత మార్కెట్లో కియా ఎలక్ట్రిక్ కార్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. కియా సైరోస్ ఐసీఇ వెర్షన్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ మోడళ్లు ఇంధన సామర్థ్యం ఉన్నా ఊహించిన దానికన్నా అధిక ధరకు అమ్ముడుబోలేదు. సైరోస్ ఈవీ మార్కెట్లో కియా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ మోడల్. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ, రాబోయే హ్యుందాయ్ కాంపాక్ట్ ఈవీలకు పోటీగా నిలవనుంది.