Top 7 SBI Mutual Funds With Best SIP Returns in 5 years
SBI Mutual Funds : 1963 నుంచి భారత్‌లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మరింతగా విస్తరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని యూటీఐతో ప్రారంభమైన ఈ పరిశ్రమలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు నిర్వహించే 45 ఏఎంసీలు ఉన్నాయి.
ఇందులో లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ పథకాల సంఖ్య 2వేల కన్నా ఎక్కువగా ఉన్నాయి. అన్ని ఎఎంసీలలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హౌస్ రూ. 11,16,708 కోట్ల విలువైన ఆస్తులతో అతిపెద్ద ఎఎంసీగా ఉద్భవించింది.
1987లో మ్యూచువల్ ఫండ్ హౌస్‌ను ప్రారంభించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) ఒకటిగా చెప్పవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఈక్విటీ, హైబ్రిడ్, డెట్ ఫండ్లలో మొత్తం 124 స్కీమ్స్ కలిగి ఉన్నాయి. ఈ స్కీమ్‌లలో కొన్ని 2 దశాబ్దాల కన్నా పాతవే ఉన్నాయి.
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లను కలిగిన అనేక స్కీమ్స్ ఏళ్ల తరబడి బెంచ్‌మార్క్ బీటర్‌లుగా ఉన్నాయి. 5 ఏళ్లలో అత్యధిక వార్షిక ఎస్ఐపీ రాబడిని ఇచ్చిన టాప్ 7 ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం అందిస్తున్నాం.. ఐదేళ్లలో ప్రతి ఫండ్‌లో నెలవారీ రూ.13,333 ఎస్ఐ పెట్టుబడితో ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎస్బీఐ PSU ఫండ్ : ఐదేళ్లలో 27.12 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని అందించింది. ఎఎంయూ రూ. 4,543 కోట్లు కాగా, నికర ఆస్తి విలువ (NAV) రూ. 29.07గా నమోదైంది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమై 10.69 శాతం వార్షిక రాబడిని అందించింది. 5 ఏళ్ల కాలంలో నెలవారీ ఎస్ఐపీ పెట్టుబడి రూ.13,333గా ఉంటే.. మొత్తం పెట్టుబడి రూ.7,99,980తో రూ.15.58 లక్షలకు పెరిగింది.
2. ఎస్బీఐ కాంట్రా ఫండ్ : ఇది కూడా ఐదేళ్లలో 24.44 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని అందించింది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి 16.23 శాతం వార్షిక రాబడిని అందించింది. 5 సంవత్సరాలలో నెలవారీ ఎస్ఐపీ పెట్టుబడి రూ. 13,333, ఇప్పుడు రూ. 14.92 లక్షలుగా మారింది.
3. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ : గత ఐదేళ్లలో 23.21 శాతం వార్షిక ఎస్ఐ రాబడిని అందించింది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభించినప్పటి నుంచి 16.05 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. 5 ఏళ్ల కాలపరిమితిలో నెలవారీ SIP పెట్టుబడి రూ. 13,333, ఇప్పుడు రూ. 14.19 లక్షలకు పెరిగింది.
4. ఎస్బీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ : ఐదేళ్లలో 22.74 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని అందించింది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి 14.65 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. నెలవారీ SIP పెట్టుబడి రూ. 13,333, ఇప్పుడు రూ. 14.04 లక్షలకు పెరిగింది.
5. ఎస్బీఐ హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ : ఐదేళ్లలో కాల వ్యవధిలో 21.17 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని అందించింది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి 17.68 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. నెలవారీ SIP పెట్టుబడి రూ. 13,333, ఇప్పుడు రూ. 13.84 లక్షలకు పెరిగింది.
6. ఎస్బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ : ఈ ఫండ్ 5 ఏళ్లలో 20.49 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని అందించింది. ఈ ఫండ్ జనవరి 2013 లో ప్రారంభించినప్పటి నుండి 18.86 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. నెలవారీ రూ. 13,333 SIP పెట్టుబడి రూ. 13.29 లక్షలకు మారింది.
7. ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ : ఈ ఫండ్ 5 సంవత్సరాలలో 20.01 శాతం వార్షిక ఎస్ఐపీ రాబడిని ఇచ్చింది. దీని ఫండ్ పరిమాణం రూ. 4,573 కోట్లు ఉండగా, యూనిట్ ధర రూ. 226.7431గా ఉంది. ఈ ఫండ్ జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి 20.71 శాతం వార్షిక రాబడిని అందించింది.
0.85 శాతం వ్యయ నిష్పత్తితో ఈ ఫండ్ కనీస ఎస్ఐపీ పెట్టుబడిగా రూ. 500, కనీస ఏకమొత్తం పెట్టుబడిగా రూ. 5వేలు కలిగి ఉంది. 5 సంవత్సరాల కాలంలో నెలవారీ ఎస్ఐపీ పెట్టుబడి రూ. 13,333 కాగా, రూ. 13.14 లక్షలకు పెరిగింది.