LIC Scheme : మీకు నెల జీతం వచ్చిందా? ఎల్ఐసీలో వండర్‌ఫుల్‌ స్కీమ్.. జస్ట్ రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ.20 లక్షలు సంపాదించవచ్చు!

LIC Savings Scheme : జీతం పడిందా? డబ్బులు ఖర్చులకు పోనూ సేవింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, రోజుకు రూ. 200 డిపాజిట్ చేయండి చాలు.. రూ. 20 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

LIC Scheme : మీకు నెల జీతం వచ్చిందా? ఎల్ఐసీలో వండర్‌ఫుల్‌ స్కీమ్.. జస్ట్ రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ.20 లక్షలు సంపాదించవచ్చు!

LIC Savings Scheme

Updated On : March 4, 2025 / 4:37 PM IST

LIC Savings Scheme : నెల జీతం పడిందా? జీతం పడితే ప్రతినెలా ఖర్చులు ఉంటాయిగా మరి. వాటికి అవే సరిపోతాయి. ఇంకా ఎక్కడ మిగిలేది అంటారా? జీతం పడగానే అందరూ ఖర్చుల గురించే ఆలోచిస్తుంటారు. సేవింగ్స్ గురించి పెద్దగా ఆలోచన చేయరు. ఎందుకంటే వచ్చిన జీతం దానికే సరిపోతుందని చెబుతుంటారు. పొదుపు చేయడం కూడా ఒక ఆర్ట్..

మీకు వచ్చిన జీతంలోనే కొద్దిగా సేవింగ్స్ కోసం దాచుకోవాలి. అప్పుడే మీ జీవితామంతా డబ్బుకు డోకా లేకుండా బతికేయొచ్చు. ఇంతకీ జీతం రాగానే ఏం చేయలా? అంటారా? ఏమి లేదు సింపుల్‌గా పెట్టుబడి పెట్టేయండి చాలు.. ఎందులో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా? అయితే, మీకోసం మార్కెట్లో అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : India Post Executives : ఇండియా పోస్ట్‌‌లో జాబ్స్ పడ్డాయి.. నో ఎగ్జామ్.. నెలకు రూ. 30వేల జీతం.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ఆకర్షణీయమైన సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తోంది. ఎల్‌ఐసీలో ఏదైనా ఒక స్కీమ్ ఎంచుకోండి. మీరు రోజూ చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేస్తే చాలు.. భవిష్యత్తు కోసం భారీగా డబ్బులను కూడబెట్టవచ్చు. ఈ డబ్బులను మీ పిల్లల విద్య లేదా వివాహం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పనులకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా, ఈ పథకం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

రోజుకు రూ. 200తో రూ. 20 లక్షలు డబ్బు :
ఎల్ఐసీ పాలసీల్లో జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి. ఇందులో మీరు రోజుకు రూ.200 కన్నా తక్కువ డిపాజిట్ చేయడం ద్వారా రూ.20 లక్షల సొమ్మును సంపాదించవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడమే. ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ. 1 లక్ష వరకు ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. మీరు ఏ పరిమాణంలోనైనా డబ్బులను కూడబెట్టుకోవచ్చు.

ఈ పథకంలో వయస్సు, కాలపరిమితి ముఖ్యమైనవి. ఉదాహరణకు.. మీకు ప్రస్తుతం 21 ఏళ్లు అనుకుందాం. రూ. 20 లక్షల డబ్బులను సంపాదించడానికి మీరు 30 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 5,922 పెట్టుబడి పెట్టాలి. అంటే.. రోజుకు దాదాపు రూ. 197 అనమాట. ఈ ప్రీమియం మొదటి సంవత్సరానికి వర్తిస్తుంది. రెండో సంవత్సరం నుంచి మీరు ప్రతి నెలా రూ. 5795 అంటే.. దాదాపు రూ. 193 ప్రీమియం చెల్లించాలి.

జీవన్ ఆనంద్ పాలసీ ఏంటి? :
ఈ ఎల్ఐసీ టర్మ్ మెచ్యూరిటీ ప్లాన్. మీరు ఈ స్కీమ్ ఎన్ని సంవత్సరాలు కావాలో అంతే ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల ప్లాన్ విషయానికి వస్తే.. ఈ కాలంలో పాలసీదారుడు ప్రీమియం చెల్లించాలి. ఈ కాలంలో పాలసీదారు మరణిస్తే.. నామినీకి ప్రాథమిక హామీ మొత్తంలో 125శాతం లేదా మరణం వరకు చెల్లించిన ప్రీమియంలలో 105శాతం లభిస్తుంది.

Read Also : Pakistan Gold : ‘కేజీఎఫ్’ను మించి.. పాకిస్తాన్‌లో రూ.80వేల కోట్ల బంగారం.. ఇకనైనా దశ తిరుగుతుందా?

ఈ పథకంలో బోనస్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు 30ఏళ్ల పాటు రోజుకు దాదాపు రూ.200 డిపాజిట్ చేస్తే.. మీకు దాదాపు రూ.30 లక్షల బోనస్ లభిస్తుంది. మరింత సమాచారం కోసం సమీపంలోని ఎలఐసీ బ్రాంచ్ దగ్గరకు వెళ్లండి. ఈ పాలసీపై మీరు లోన్ కూడా తీసుకోవచ్చు.

ఈ ప్లాన్‌ ఎవరు తీసుకోవచ్చు? :
18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కాలపరిమితి 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుంది. ఇందులో ప్రీమియంను నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.