India Post Executives : ఇండియా పోస్ట్‌లో జాబ్స్ పడ్డాయి.. నో ఎగ్జామ్.. నెలకు రూ. 30వేల జీతం.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
India Post Executives : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఈ నియామకాలకు అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ఎంపిక అయితే నెలకు రూ. 30వేల జీతంతో పాటు అలవెన్సులు కూడా అందుతాయి.

India Post Payment Bank
India Post Executives : ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఉద్యోగాలు పడ్డాయి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేసే ఏ అభ్యర్థి అయినా ఈ పోస్టుల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కావాలంటే (ippbonline.com)లో చెక్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 మార్చి 2025 వరకు సమయం ఉంది.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? వెంటనే ఈ పని చేయండి.. అకౌంట్లలో డబ్బులు పడతాయి..!
ఇండియా పోస్ట్‌లో ఎన్ని ఖాళీలంటే? :
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 51 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వయస్సు విషయానికొస్తే.. దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 35 ఏళ్లు ఉండాలి.
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల ఎంపిక కోసం అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ippbonline.com)ని విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగం ఎన్ని ఏళ్లు ఉంటుందంటే? :
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం, నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. అప్పుడే వారికి ప్రాధాన్యత ఉంటుంది. మీరు అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే.. ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ వ్యవధిలో ఉంటాయి. ప్రారంభంలో ఈ ఉద్యోగాలు ఒక ఏడాది కాంట్రాక్టుపై ఉంటాయి. మీ పనిని బట్టి ప్రతి ఏడాది పొడిగించవచ్చు. ఈ డీల్ గరిష్టంగా 3 ఏళ్లు ఉంటుంది.
జీతం ఎంతంటే? :
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30వేల జీతం అందిస్తారు. ఇందులో అనేక అలవెన్సులు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అభ్యర్థులకు పనితీరు ఆధారంగా వార్షిక ఇంక్రిమెంట్, ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు రుసుము ఎంత? :
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో పోస్టుకు దరఖాస్తు చేసేందుకు (SC/ST/PWD) కేటగిరీ అభ్యర్థులు రూ. 150 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు (జనరల్ కేటగిరీతో సహా) రూ. 750 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి.