8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. భారీగా పెరగనున్న పెన్షర్లు, ఉద్యోగుల వేతనాలు.. ఫుల్ డిటెయిల్స్..!
8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది. అదేగానీ జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్ల భత్యాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగుల వేతనాలను సవరించేందుకు 2025 జనవరిలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. కొత్త 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వేతన సంఘంపై అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన వేతన సంఘం ప్రకారం.. జీతాల పెంపు శాతంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
ఒకవేళ కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే.. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, 65 లక్షల మంది పెన్షనర్ల భత్యాలను అందుకోనున్నారు. 8వ కేంద్ర వేతన సంఘం (CPC) ఏర్పాటుకు పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ఇప్పటికీ సీపీసీ ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించలేదు. వీరి పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఖరారు అయ్యే అవకాశం ఉంది.
జీతభత్యాలపై సవరణలు :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాదాలను పరిష్కరించే నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం (NC-JCM) 8వ వేతన కమిషన్ కోసం ప్రతిపాదిత (ToR)ను ఇప్పటికే సమర్పించింది. ఈ ప్రతిపాదనను అధికారికంగా చర్చించడానికి స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు సంబంధించి మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (MACP) పథకంలో సంస్కరణలు ప్రతిపాదించారు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదిస్తే.. ఒక ఉద్యోగి తన సర్వీసు కాలంలో కనీసం ఐదు పదోన్నతుల వరకు పొందవచ్చు.
డీఏపై ఉద్యోగుల డిమాండ్లు :
8వ వేతన సంఘం అమలుకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. కనీస వేతనంలో డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులు తమకు రిలీఫ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
మూడు కాదు.. ఐదు యూనిట్లకు పెంచండి :
8వ వేతన సంఘం కనీస వేతనాన్ని నిర్ణయించాలని శివ గోపాల్ మిశ్రా సూచించారు. 3 యూనిట్లకు బదులుగా 5 యూనిట్ల వినియోగ అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఎందుకంటే.. సంపాదించే వారిపై ఆధారపడిన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుందని మిశ్రా పేర్కొన్నారు.
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే చట్టపరమైన బాధ్యత కూడా ఉంది. దీని ప్రకారమే.. కుటుంబ యూనిట్లను మూడు యూనిట్లుగా కాకుండా ఐదు యూనిట్లుగా లెక్కించాలన్నారు.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? వెంటనే ఈ పని చేయండి.. అకౌంట్లలో డబ్బులు పడతాయి..!
జీతం ఎంత పెంపు ఉండొచ్చు? :
2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. కొత్త జీతాలు ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత కనీస వేతనానికి తగినట్టుగా కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలు ఉంటాయి. ప్రస్తుత ఫిట్‌మెంట్ కారకం 2.57 నుంచి 2.86కి పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. లెవల్ 1లో కనీస వేతనం రూ. 18వేల నుంచి రూ. 51,480కి పెరుగుతుంది. 10 లెవల్ గ్రేడ్ ఉద్యోగుల్లో వారి జీతాలు, పెన్షన్లలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది.