PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? వెంటనే ఈ పని చేయండి.. అకౌంట్లలో డబ్బులు పడతాయి..!
PM Kisan Yojana 19th Installment : పీఎం కిసాన్ రూ.2వేలు డబ్బులు ఇంకా పడలేదా? పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan Yojana 19th Installment
PM Kisan Yojana 19th Installment : పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? మీ అకౌంట్ చేసుకున్నారా? గత ఫిబ్రవరి 24నే అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ రూ. 2వేలు పడ్డాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 19వ విడతను ప్రధాని మోదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) స్కీమ్ ద్వారా దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో సుమారు 22వేల కోట్లు క్రెడిట్ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏటా రూ.6వేలు కేంద్రం ఇస్తోంది. ఒక్కసారి కాకుండా మూడు వాయిదాలలో రూ. 2వేలు చొప్పున జమ చేస్తోంది.
అక్టోబర్ 2025లో పీఎం కిసాన్ 18వ విడత విడుదలైంది. ఆ తర్వాత ఇటీవలే 19వ విడతను మోదీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. పీఎం కిసాన్ రైతులకు అందించే రూ.6వేలలో ప్రతి విడతకు రూ. 2వేలు అందిస్తారు. కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు పడకపోతే ఆందోళన చెందుతుంటారు.
ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో కూడా పీఎం కిసాన్ రూ. 2వేలు పడలేదా? ఇంతకీ ఏం చేయాలో తెలియడం లేదా? అసలు మీ డబ్బులు పడ్డాయో లేదో ఎలా వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవాలి? ఏం చేస్తే.. ఆ డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అర్హతలు ఉంటేనే :
పీఎం కిసాన్ ఆర్థిక సాయానికి అర్హతలు ఉండాలి. అలాంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి. కొంతమంది రైతులకు అన్ని అర్హతలు ఉన్నా వారికి రూ. 2వేలు డబ్బులు అందకపోవచ్చు. అందుకు చాలా కారణాలు ఉంటాయని తెలుసుకోవాలి. మీ బ్యాంకు అకౌంట్లలో కూడా రూ. 2వేలు జమ కాలేదా? ఫోన్, ఈమెయిల్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.
అకౌంటులో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేయాలంటే? :
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) సందర్శించండి.
‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి.
మీ డబ్బుల స్టేటస్ స్ర్కీన్‌పై కనిపిస్తుంది.
జాబితాలో మీ పేరును ఇలా చెక్ చేయండి :
పీఎం కిసాన్ (pmkisan.gov.in) వెబ్‌సైట్ చెక్ చేయండి.
‘Beneficiary List’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
‘Get Report’ పై క్లిక్ చేయండి.
ఆపై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
ఏదైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606 కాల్ చేయొచ్చు.
ఈ రైతులకు డబ్బులు పడవు :
పీఎం కిసాన్ కింద ఇలాంటి రైతులు ప్రయోజనాలు పొందలేరు. రైతు కుటుంబంలో ఒకరైనా ట్యాక్సు కడుతుంటే.. వారికి ఈ ప్రయోజనం ఉండదు. ఒక రైతు నుంచి భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేసేవారికి కూడా ప్రయోజనం అందదు. పీఎం కిసాన్ కోసం సొంత భూమిని కలిగి ఉండాలి.
ఇలా ఫిర్యాదు చేయండి :
పీఎం కిసాన్ అందని రైతులు (pmkisan-ict@gov.in) లేదా (pmkisan-funds@gov.in) ద్వారా తమ ఫిర్యాదు తెలియజేయొచ్చు.
హెల్ప్‌లైన్ నెంబర్ (011-24300606) కాల్ చేసి తమ ఫిర్యాదులను చేయొచ్చు.
హెల్ప్‌లైన్ నంబర్లు 155261, టోల్ ఫ్రీ నెంబర్ (1800-115-526)కి కాల్ చేయొచ్చు.
ల్యాండ్ లైన్ నంబర్లు (011-23381092, 23382401)కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
హెల్ప్ లైన్ నంబర్ (0120-6025109) కూడా కాల్ చేయొచ్చు.