Gold Rates : బాబోయ్.. ఈ బంగారం ఇంతలా ఎందుకు పెరుగుతుంది? తగ్గినట్టే తగ్గి పెరగడానికి కారణం ఇదేనట.. ఎక్స్ పర్ట్స్ చెప్పింది వింటే..

Gold Rates : బంగారం ధర తగ్గినట్టే తగ్గి ఎగిసిపడుతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్.. ఇప్పుడే అందరూ బంగారం కొనాలని ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం ఏమో ఇలా పెరిగిపోతూనే ఉంది. ఇంతకీ నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rates : బాబోయ్.. ఈ బంగారం ఇంతలా ఎందుకు పెరుగుతుంది? తగ్గినట్టే తగ్గి పెరగడానికి కారణం ఇదేనట.. ఎక్స్ పర్ట్స్ చెప్పింది వింటే..

Will gold Rates keep rising this Wedding Season

Updated On : March 4, 2025 / 11:57 AM IST

Gold Rates : బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు పెరుగుతూనే ఉండగా, కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా ఈ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో బంగారం ధరలు 24 క్యారెట్లకు రూ. 87,000 కన్నా ఎక్కువగా పెరిగాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also : Smart SIP Tips : మీకు జీతం పడిందా? రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ. 10 కోట్లకుపైగా సంపాదించుకోవచ్చు!

బంగారం ధరలకు కారణాలివే :
పసిడి ధరల పెరుగుదలకు ప్రధానంగా బలహీనమైన యూఎస్ డాలర్, బలమైన స్థానిక డిమాండ్ కారణమని చెప్పవచ్చు. దాదాపు 18 నెలల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. గత జనవరిలో ధరల సూచికలో భారీగా బంగారం పెరిగిందని అమెరికాలో ఇటీవలి ఆర్థిక డేటా సూచిస్తుంది.

ఈ సంకేతాలు ద్రవ్యోల్బణం వేగాన్ని సూచిస్తున్నాయి. సంవత్సరం చివరి సగం వరకు ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడేందుకు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైనదిగా ఎంచుకున్నారు.

గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను స్తంభింపజేసింది. దాంతో సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారం ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ పెరగడం వల్లే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తోంది.

ప్రపంచ బంగారం ధరల పెరుగుదల భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ సమయంలో ఆభరణాల అమ్మకాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. చైనాలోని డీలర్లు అయితే బంగారం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

బంగారంపై భౌగోళిక రాజకీయాల ప్రభావం :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు, కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు, పెరిగిన భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయం అనేవి బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ట్రంప్ సుంకాల హెచ్చరికలు ఆర్థిక అనిశ్చితికి ఆజ్యం పోశాయి. దాంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నింటాయి. అంతేకాకుండా, చైనా కేంద్ర బ్యాంకు వరుసగా రెండో నెలలో బంగారు నిల్వలను భారీగా పెంచేయడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

భారత్‌లో బంగారం ధరలు ఎంతగా పెరిగాయంటే?
2011 ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా రూ. 25వేల మార్కును తాకింది. జూలై 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ. 50వేలు దాటింది. బంగారం రూ.25వేల నుంచి రూ.50వేలకి పెరగడానికి 108 నెలలు పట్టింది. కానీ, బంగారం 50వేల స్థాయి నుంచి రూ.75వేలకి చేరుకోవడానికి కేవలం 48 నెలలు మాత్రమే పట్టింది. సెప్టెంబర్ 2024లో బంగారం ధర రూ.75వేలకి చేరుకుంది.

ప్రస్తుతం భారత్‌లో ఈరోజు (మార్చి 4) దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.8,753గా ఉంది. బంగారం ధరలు రూ.లక్ష మార్క్ చేరుకునే సమయం ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, 2025లో బంగారం ధర రూ.1 లక్ష మార్కును నిజంగా తాకుతుందా లేదా అనేది ప్రశ్నగా మారింది.

అనిశ్చితి సమయంలో గోల్డ్ ఎందుకు సురక్షితమంటే? :
బంగారం సురక్షితమైన ఆస్తిగా చెబుతారు. సంక్షోభ సమయంలో పసిడి ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు.. సెప్టెంబర్ 11, 2001 ఉగ్రవాద దాడులు, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేశారు. ద్రవ్యోల్బణం కారణంగా.. డబ్బు విలువ స్థిరంగా ఉండదు. కానీ, కాలక్రమేణా తగ్గుతుంది. బంగారం విలువను కలిగి ఉంటుంది. దీన్నే ద్రవ్యోల్బణ హెడ్జ్ అని పిలుస్తారు.

ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడం, రష్యాపై విధించిన ఆంక్షలు, విదేశాల్లో రష్యా విదేశీ ప్రభుత్వ బాండ్ హోల్డింగ్‌లను స్తంభింపజేయడం వంటివి ప్రభుత్వాలు విదేశీ కరెన్సీ హోల్డింగ్‌లను కోల్పోయే ప్రమాదాన్ని ఎత్తి చూపాయి.

ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లు చేయడం కనిపిస్తోంది. ఫలితంగా 2022లో రికార్డు స్థాయిలో 1,082 టన్నుల కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లు జరిగాయి. 2023 సంవత్సరంలో చరిత్రలో రెండో అత్యధిక వార్షిక కొనుగోలు 1,051 టన్నులుగా నమోదైంది. ఆ తర్వాత 2024లో 1,041 టన్నుల బంగారం కొనుగోలు జరిగింది.

బంగారం ధరలపై నిపుణులు అంచనాలివే :
కేంద్ర బ్యాంకుల నుంచి నిరంతరం అధిక డిమాండ్ బంగారం ధరను 9శాతం వరకు పెంచే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకురాలు లీనా థామస్ పేర్కొన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థికవేత్తలు కూడా ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.

వాస్తవానికి, గోల్డ్ బాండ్లతో పోలిస్తే.. వడ్డీ లేని లోహాలు మరింత ఆకర్షణీయంగా మారి బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తుంది. గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకులు ఆశించిన దానికన్నా తక్కువ అమెరికా వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గిస్తే.. బంగారం ధరలు కొత్త అంచనా కన్నా తక్కువగా ఉండవచ్చు.

Read Also : Gold Investment : పెట్టుబడికి ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్ ఎందుకు బెటర్? ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే మీరు ఇదే చేస్తారు!

అమెరికాలో బంగారం ధరలివే :
యూఎస్ డాలర్లలో బంగారం ధర 3వేల డాలర్ల మైలురాయిని చేరుకుంటోంది. ప్రస్తుతం, ఒక ఔన్స్ బంగారం దాదాపు 2,858 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే.. 10 గ్రాములకు దాదాపు 1,027 డాలర్లు అనమాట.

డాలర్‌తో పోలిస్తే.. (INR-USD) విలువ రూ. 87 వద్ద.. దాదాపు రూ. 89,400 ట్రేడ్ అవుతోంది. సంవత్సరాంతానికి బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు 3,100 డాలర్లకు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ రీసెర్చ్ అంచనా వేయగా, అంతకన్నా తక్కువగా లేదా మించిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.