Smart SIP Tips : మీకు జీతం పడిందా? రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ. 10 కోట్లకుపైగా సంపాదించుకోవచ్చు!

Smart SIP Tips : జీతం వచ్చిందా? చేతిలో డబ్బులు ఉండగానే ఇలా పెట్టుబడి పెట్టండి.. కేవలం రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ.10 కోట్లకు పైగా డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుసా? ఎందులో పెట్టుబడి పెట్టాలంటే?

Smart SIP Tips : మీకు జీతం పడిందా? రూ. 15వేల పెట్టుబడితో 30 ఏళ్లలో రూ. 10 కోట్లకుపైగా సంపాదించుకోవచ్చు!

Smart SIP Tips

Updated On : March 2, 2025 / 6:11 PM IST

Smart SIP Tips : మార్చి నెల వచ్చేసింది.. అందరికి జీతాలు పడే టైమ్.. మీకు కూడా ఈ నెల జీతం పడిందా? అయితే, మీ నెల జీతాన్ని ముందుగా పెట్టుబడి వైపు మళ్లించండి. ప్రస్తుత రోజుల్లో ఆర్థికపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది లేదు.

నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం కష్టమే మరి. అందుకే ఈ డబ్బు వృథా కాకుండా ఉండాలన్నా భవిష్యత్తులో మీ పిల్లల చదువు దగ్గర నుంచి ఆడబిడ్డలు పెరిగి పెళ్లి టైమ్ వరకు డబ్బుపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే.. మీరు తప్పనిసరిగా మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమే సరైన మార్గం.

Read Also : AC discounts : సమ్మర్ బంపర్ ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. రూ. 20వేల లోపు ధరలో ఏసీలు మీకోసం.. ఓ లుక్కేయండి!

సిప్ అద్భుతమైన ప్లాన్..
ఒకవేళ మీ పిల్లల్లో ఎవరైనా విదేశాల్లో చదివించాలని ప్లాన్ చేస్తున్నా సరే.. ఇప్పటినుంచే ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఎంచుకోండి. మీరు మొదటిసారిగా మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే తప్పక కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే.. చాలామందికి ఎక్కడ పెట్టుబడి పెడితే హై రిటర్న్స్ వస్తాయో పెద్దగా తెలియదు. మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) ఎంచుకోవచ్చు.

30ఏళ్లలో కోటిశ్వీరులు కావాలంటే? :
ఎస్ఐపీలో పెట్టుబడి ద్వారా మీరు 30ఏళ్లలో కోటిశ్వీరులు అయిపోవచ్చు. అది మీరు చేసే ఇన్వెస్ట్ అమౌంట్, టైమ్ పీరియడ్, రాబటి రేటు అంశాలను ఆధారంగా ఉంటుందని గుర్తించాలి. ఎస్ఐపీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే వారం, నెలకు ఒకసారి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట.

ఎస్ఐపీలో చాలా తక్కువ రిస్క్‌ ఉంటుంది. అంతే లాభాలు ఉంటాయి. ఎస్ఐపీకి ఫుల్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పవచ్చు. ఇంతకీ 30ఏళ్లలో నెలకు రూ. 15వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని కోట్ల డబ్బు చేతికి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Top 10 Gold ETF : గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేస్తే లాభమా? నష్టమా? భారత్‌లో టాప్ 10 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవే.. ఫుల్ డిటెయిల్స్..!

నెలకు రూ. 15వేల పెట్టుబడి.. 30ఏళ్లలో రూ. 10కోట్ల రాబడి :
అధిక మొత్తంలో రాబడి పొందాలంటే.. మీరు ఎస్ఐపీలో ఈ ఫార్ములా (15-15-30) గురించి తెలుసుకోవాలి. మీరు ప్రతి నెలా రూ. 15 వేలను పెట్టుబడి పెట్టాలి. 30 ఏళ్ల పాటు అలానే పెడుతూ పోవాలి.

అందులో 15 శాతంగా రాబడిగా లెక్కిస్తే.. రూ. 10.51 కోట్లకు పైగా డబ్బులు మీ చేతికి వస్తాయి. మీరు 30 ఏళ్లలో పెట్టుబడి పెట్టేది కేవలం రూ. 54 లక్షలు మాత్రమే. కానీ, మీకు రాబడి దాదాపు రూ. 9.97 కోట్లు వస్తాయి. ఎస్ఐపీలో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తేనే హై రిటర్న్స్ వస్తాయని గమనించాలి.