AC discounts : సమ్మర్ బంపర్ ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. రూ. 20వేల లోపు ధరలో ఏసీలు మీకోసం.. ఓ లుక్కేయండి!
AC discounts : కొత్త ఏసీ కోసం చూస్తు్న్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. రూ. 20వేల లోపు ధరలో ఏసీలు ఉన్నాయి. మళ్లీ ఏసీల ధరలు పెరిగేలోగా ఇప్పుడే మీకు నచ్చిన ఏసీని కొనేసుకోండి.

Massive AC discounts on Flipkart
AC discounts : సమ్మర్ వచ్చేసింది. ఎండలు మెల్లగా పెరుగుతున్నాయి. ఉక్కపోతలు కూడా మొదలయ్యాయి. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఏసీలు లేదా కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి. అందుకే ముందుగానే ఏసీలు లేదా కూలర్లు ఇంటికి కొనితెచ్చుకోవాలని భావిస్తుంటారు. మీరు కూడా కొత్త ఏసీలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే, ఇదే సరైన సమయం. మీరు 1.5-టన్ను స్ప్లిట్ ఏసీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని భావిస్తుంటే.. వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వోల్టాస్, ఎల్‌జీ, బ్లూ స్టార్, రియల్‌మి, హైయర్ వంటి టాప్ బ్రాండ్లు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభంలో ఏసీలపై అద్భుతమైన డీల్ అని చెప్పవచ్చు.
Read Also : Vivo T4x 5G Launch : వారెవ్వా.. వివో T4x 5జీ ఫోన్ కిర్రాక్.. ఈ నెల 5నే లాంచ్ అంట.. ధర, ఫీచర్లు కెవ్వు కేక..!
వేసవి కాలం మొదలు కావడంతో ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరగనుంది. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో ఏసీల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పటివరకూ ఆగకుండా ఇప్పుడే తక్కువ ధరలో మీకు నచ్చిన బ్రాండ్ ఏసీలను కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ స్ప్లిట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
కొనుగోలుదారులు పీక్ సీజన్‌కు ముందు 50 శాతం కన్నా ఎక్కువ తగ్గింపుతో హై-ఎండ్ మోడళ్లను పొందవచ్చు. మీరు మీ ఇంటిని 1.5-టన్ను స్ప్లిట్ ఏసీతో అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. వేల రూపాయలు ఆదా చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్ కూడా. ఫ్లిప్‌కార్ట్ వోల్టాస్, ఎల్‌జీ, బ్లూ స్టార్, రియల్‌మి, హైయర్ వంటి టాప్ ఏసీ బ్రాండ్‌లపై ధరలు తగ్గాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ఏసీని ఎంచుకుని వెంటనే కొని ఇంటికి తెచ్చుకోండి.
ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ స్ప్లిట్ ఏసీ బెస్ట్ బడ్జెట్ డీల్స్ ఇవే :
1. వోల్టాస్ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ (4503446)
అసలు ధర: రూ. 64,990
డిస్కౌంట్ ధర: రూ. 33,990 (47 శాతం తగ్గింపు)
అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్: రూ. 5,200 వరకు
2. లాయిడ్ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఏసీ (GLS18I3FWBEW)
అసలు ధర : రూ. 58,990
తగ్గింపు ధర : రూ. 34,490 (41 శాతం తగ్గింపు)
అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ : రూ. 5,200 వరకు
3. మార్క్యూ (MarQ) 0.7 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ :
అసలు ధర : రూ. 46,499
తగ్గింపు ధర : రూ. 19,990 (57 శాతం తగ్గింపు)
ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు.
4. వర్ల్‌పూల్ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ (SAI18P34DEP0)
అసలు ధర : రూ. 66వేలు
తగ్గింపు ధర : రూ. 31,150 (52 శాతం తగ్గింపు)
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
5. క్యారియర్ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ (CAI18CE3R34F0)
అసలు ధర : రూ. 68,990
తగ్గింపు ధర : రూ. 34,299 (50 శాతం తగ్గింపు)
6. హైయర్ 1.5 టన్ 3-స్టార్ స్ప్లిట్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ (HU17-3BN-INV)
అసలు ధర : రూ. 60వేలు
డిస్కౌంట్ ధర : రూ. 33,990 (43 శాతం తగ్గింపు )
అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ : రూ. 5,200 వరకు
ఇప్పుడే ఎందుకు ఏసీలు కొనాలంటే? :
పీక్ సీజన్ ముందు భారీ డిస్కౌంట్లకు ఏసీలు అందుబాటులో ఉంటాయి. వేసవి సమీపిస్తున్న కొద్దీ ఏసీలు ధరలు అమాంతం పెరుగుతాయి. టాప్ బ్రాండ్లలో ప్రీమియం ఏసీ మోడళ్లపై రూ. 30వేల వరకు ఆదా చేసుకోండి. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో ఎంపిక చేసిన మోడళ్లపై అదనంగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.