Vivo T4x 5G Launch : వారెవ్వా.. వివో T4x 5జీ ఫోన్ కిర్రాక్.. ఈ నెల 5నే లాంచ్ అంట.. ధర, ఫీచర్లు కెవ్వు కేక..!
Vivo T4x 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మార్చి 5న భారత మార్కెట్లోకి వివో T4x 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు, డిజైన్ వివరాలు ముందే కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo T4x 5G Launch
Vivo T4x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల (మార్చి) 5న భారత మార్కెట్లోకి వివో బ్రాండ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. అదే.. వివో (Vivo T4x) 5జీ ఫోన్. షెడ్యూల్ ప్రకారం.. ఆ రోజున మధ్యాహ్నం భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని వివో అధికారికంగా ధృవీకరించింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ వంటి ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రమోషనల్ పోస్టర్ ఫోన్‌ను ప్రంటో పర్పల్, మెరైన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో డిస్‌ప్లే చేస్తోంది.
వివో T4x 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) :
భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లు : వివో T4x 5జీ ఫోన్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా. వివో ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా టీజ్ చేసింది. అందులో ఏఐ ఎరేస్ (AI Erase) ఏఐ ఫోటో అప్‌గ్రేడ్, ఏఐ డాక్యుమెంట్ మోడ్ వంటివి ఉండనున్నాయి. అదనంగా, ఈ వివో ఫోన్ ఐఆర్ బ్లాస్టర్, మిలిటరీ-గ్రేడ్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు.
డిస్‌ప్లే, పర్పార్మెన్స్ :
వివో T4x 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 5జీ పర్పార్మెన్స్, మల్టీ టాస్కింగ్‌ను అందించనుంది.
కెమెరా, ఫోటోగ్రఫీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, గత వెర్షన్ వివో T3x 5జీలో కనిపించే 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
భారతదేశంలో వివో T4x 5జీ ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో టీ4ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ. 15వేల కన్నా తక్కువగా ఉంటుందని వివో సూచించింది.
వివో T3x 5G ధరలు ఇలా ఉన్నాయి :
128GB స్టోరేజ్ ధర రూ.12,499
6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.13,999.
8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 15,499.
అప్‌గ్రేడ్ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో వివో T4x 5G ధర కూడా అదే రేంజ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.