Post Office Scheme : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు పండగే.. జీవితాంతం ప్రతి నెలా రూ. 20,500 సంపాదించవచ్చు!

Post Office Scheme : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు ఇది అద్భుతమైన పథకం.. రిటైర్మెంట్ తర్వాత దాచుకున్న డబ్బును ఇలా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో డబ్బుకు ఎలాంటి కొరత లేకుండా హాయిగా జీవించవచ్చు.

Post Office Scheme : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు పండగే.. జీవితాంతం ప్రతి నెలా రూ. 20,500 సంపాదించవచ్చు!

Post Office Scheme

Updated On : March 1, 2025 / 4:21 PM IST

Post Office Scheme : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టారంటే రిటైర్మమెంట్ సమయంలో డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతికేయొచ్చు. మీరు ప్రతి నెలా ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.

పోస్ట్ ఆఫీస్ ప్రతి నెలా ఆదాయం పొందే పథకాన్ని అందిస్తోంది. పదవీ విరమణ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : BSNL Yearly Plan : BSNL సూపర్ ప్లాన్.. ఈ వార్షిక ప్లాన్‌‌తో రోజుకు 2GB డేటా.. ఓటీటీ బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన, స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ డబ్బును సురక్షితమైన ప్లాన్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రతి నెలా రూ. 20,500 ఆదాయం :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో ప్రస్తుత వడ్డీ రేటు 8.2శాతం. ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికం. మీరు ఇందులో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి సంవత్సరం రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. మీరు ఈ మొత్తాన్ని ప్రతి నెలా రూ. 20,500 రూపంలో రాబడిగా పొందవచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి క్రెడిట్ అవుతుంది.

పెట్టుబడి పరిమితి, వ్యవధి :
గతంలో ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉండగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 30 లక్షలకు పెంచారు. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. మెచ్యూరిటీ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? :
60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సులో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకులో అప్లయ్ చేసుకోవచ్చు.

పన్ను ప్రయోజనాలివే :
ఈ పథకం నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. అయితే, (SCSS) కింద కొంత పన్ను ఆదా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది.

ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఇవే :
సురక్షిత పెట్టుబడి : ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా సురక్షితం.
స్థిర నెలవారీ ఆదాయం : పదవీ విరమణ తర్వాత మీరు సాధారణ ఖర్చులకు ప్రతి నెలా ఆదాయం వస్తుంది.
వడ్డీ రేటు : మీకు 8.2శాతంగా వడ్డీ లభిస్తుంది.
కాల వ్యవధి : ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెట్టుబడి వ్యవధిని పొడిగించవచ్చు.

Read Also : Salary Management : మీకు ఈ నెల జీతం వచ్చిందా? ఇప్పుడే ఇలా పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు.. హాయిగా బతికేయొచ్చు..!

నిబంధనలు, షరతులు :
ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు నిబంధనలు, షరతులన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఈ పథకం మీ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీ పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన, సురక్షితమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టడం మంచిది.