BSNL Yearly Plan : BSNL సూపర్ ప్లాన్.. ఈ వార్షిక ప్లాన్‌‌తో రోజుకు 2GB డేటా.. ఓటీటీ బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

BSNL Yearly Plan Price : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్‌లకు బైబై చెప్పేయండి.. వార్షిక ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటాతో పాటు ఓటీటీ బెనిఫిట్స్ ఏడాది వరకు ఎంజాయ్ చేయొచ్చు.

BSNL Yearly Plan : BSNL సూపర్ ప్లాన్.. ఈ వార్షిక ప్లాన్‌‌తో రోజుకు 2GB డేటా.. ఓటీటీ బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

BSNL Most Affordable yearly plan

Updated On : March 1, 2025 / 3:32 PM IST

BSNL Yearly Plan Price : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే, ప్రతి నెలా రెగ్యులర్ రీఛార్జ్‌లకు గుడ్ బై చెప్పేయండి. ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ (BSNL) నుంచి కొన్ని అద్భుతమైన వార్షిక రీఛార్జ్‌లు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

మీరు దీర్ఘకాలిక ప్లాన్లను కోరుకుంటే ఈ రీఛార్జ్ ప్లాన్‌లతో అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తాయి. బీఎస్ఎన్ఎల్ వార్షికంగా రూ. 1515 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలవారీ రీఛార్జ్ బదులుగా చాలా మందికి ఈ వార్షిక ప్లాన్ ప్రత్యామ్నాయంగా మారింది.

Read Also : Whatsapp : వాట్సాప్‌లో వండర్‌ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!

మీరు కూడా బీఎస్ఎన్ఎల్ క్యారియర్‌గా మారాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే ఈ కొత్త వార్షిక ప్లాన్ తీసుకోండి. దేశవ్యాప్తంగా 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. లిమిట్ దాటిని తర్వాత కూడా యూజర్లు 40KBPs స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

అన్నింటికంటే మించి తరచుగా రీఛార్జ్‌ల ఇబ్బంది ఉండదు. మీరు ఫోన్ కాల్స్, భారీ ఇంటర్నెట్ వాడకానికి బెస్ట్ ప్లాన్లలో ఇదొకటి. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు రోజుకు దాదాపు 4.2 రూపాయలకు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఏడాది పొడవునా నెలవారీ రీఛార్జ్ ఇబ్బందులను నివారించే సరసమైన లాంగ్ టైమ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 1515 ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :

  • బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, ఓటీటీ కంటెంట్ కోసం 2GB రోజువారీ డేటా (ఏడాదికి మొత్తం 720GB).
  • భారత్ అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్.
  • కనెక్ట్ అయ్యేందుకు రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు
  • 40Kbps పోస్ట్ డేటా లిమిటెడ్ స్పీడ్ కనెక్టివిటీ
  • 365 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ. 198 ప్లాన్.. రోజుకు 2జీబీ డేటా :
ఈ BSNL డేటా వ్యాలిడిటీ దాదాపు 40 రోజులు ఉంటుంది. రోజువారీ పరిమితి 2GB ఉంటుంది. కానీ, ఈ వోచర్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ సర్వీసులు ఉండవు. ప్రాథమిక కనెక్టివిటీని కోరుకునే యూజర్లకు ప్రధానంగా కాల్స్, ఎస్ఎంఎస్ చేయడానికి వాట్సాప్ లేదా ఇతర అప్లికేషన్‌లను ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ప్లాన్.

బీఎస్ఎన్ఎల్ రూ.411 ప్లాన్ :
ఈ ప్లాన్ మీకు 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. మొత్తం 180GB రోజుకు 2GB డేటాకు దగ్గరగా ఉంటుంది. డేటా ఓనర్ వోచర్. ఈ కొత్త ప్లాన్ దీర్ఘకాలిక ప్లాన్‌గా చెప్పవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. మీ సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు డేటా ప్లాన్‌ల కోసం ఇది ఎంచుకోవచ్చు.

Read Also : Power Bill Tips : అసలే ఎండకాలం.. మీ ఇంట్లో ఈ 3 వస్తువులను అసలు వాడొద్దు.. కరెంట్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!

బీఎస్ఎన్ఎల్ రూ. 151 ప్లాన్ :
ఈ ప్లాన్ వ్యాలిడిటీ దాదాపు 30 రోజులు ఉంటుంది. మీరు మొత్తం 40GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ రావు. మీకు డేటా ఓన్లీ వోచర్ కావాలంటే ఇదే బెస్ట్ ప్లాన్ కావచ్చు. బీఎస్ఎన్ఎల్‌తో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మీకు రీఛార్జ్‌తో పాటు వ్యాలిడిటీ అప్‌గ్రేడ్‌ను కూడా అందిస్తుంది.