Whatsapp : వాట్సాప్‌లో వండర్‌ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!

Whatsapp : వాట్సాప్‌లో అనేక ప్రైవసీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మరో కొత్త ఫీచర్ రిలీజ్ వస్తోంది. యూజర్లు తమ ప్రొఫైల్ లింక్‌లను కనిపించాలో లేదో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట.

Whatsapp : వాట్సాప్‌లో వండర్‌ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!

Whatsapp

Updated On : March 1, 2025 / 1:53 PM IST

Whatsapp : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఆ ఫీచర్లను ఫస్ట్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తారు. తాజాగా మరో కొత్త ఫీచర్ రాబోతుంది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉంది. కొత్త ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ లింక్ ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : UPI New Rules : గూగుల్ పే, పేటీఎంల్లో UPI పేమెంట్స్ చేస్తున్నారా? బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్ వచ్చాయ్..!

వాట్సాప్ ఫీచర్లు, అప్‌డేట్‌లను అందించే ప్లాట్‌ఫామ్ (WABetaInfo) యాప్‌.. త్వరలో కొత్త ప్రైవసీ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ 2.25.5.19 వాట్సాప్ బీటా వెర్షన్ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చునని వెల్లడించింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన నాలుగు ఆప్షన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి.

ఇలా 4 ఆప్షన్లతో ఎంచుకోవచ్చు :
నివేదికలో స్క్రీన్‌షాట్‌ ప్రకారం.. వాట్సాప్ యూజర్లందరికి తమ ప్రొఫైల్ లింక్ విజబిలిటీని ఎంచుకునేందుకు వీలుంటుంది. అంటే.. వినియోగదారులు తమ ప్రొఫైల్‌తో లింక్ చేసిన సోషల్ మీడియా లింక్‌లను ఎవరు చూడొచ్చు? ఎవరు చూడకూడదనే దానిపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఈ విజబిలిటీని ఎంచుకునేందుకు మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ జాబితాలో ‘EveryOne’, ‘My Contacts’, ‘My Contacts Except, Nobody’ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

మీరు ప్రొఫైల్ లింక్‌ను అందరితో షేర్ చేసుకోవచ్చు. మీ సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేయగలరు. ఈ ఫీచర్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్ల పరిధిని పెంచుకోవాలనే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Read Also : PF Interest : వేతన జీవులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై బిగ్ అప్‌డేట్.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

అలాగే, మీ సోషల్ లింక్‌లను ప్రొఫైల్ ద్వారా షేర్ చేసేందుకు వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉంది. వాట్సాప్ యూజర్లందరిని చేరుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లోని అందరికీ అందుబాటులోకి వస్తుంది.