PF Interest : వేతన జీవులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై బిగ్ అప్‌డేట్.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

PF Interest : కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతాన్ని అందించనుంది. ఏడు కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లోకి త్వరలో జమ అవుతుంది.

PF Interest : వేతన జీవులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై బిగ్ అప్‌డేట్.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

PF Interest

Updated On : March 1, 2025 / 12:46 PM IST

PF Interest : వేతన జీవులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. 2024-25 సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి కీలక ప్రకటన చేసింది. పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతం వద్దనే కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ వడ్డీ గత ఆర్థిక సంవత్సరంతో సమానంగా ఉంటుంది.

Read Also : LPG Price Hike : పండుగ సీజన్‌లో సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. మీ నగరంలో కొత్త ధరలివే..

అంటే.. వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదని అర్థం. 2024-25 సంవత్సరంలో పీఎఫ్ సభ్యులకు ఈసారి కూడా 8.25 శాతమే వడ్డీని అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓకు 7 కోట్ల మంది పీఎఫ్ చందాదారులు ఉన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. గత ఫిబ్రవరిలో ఈ వడ్డీని 8.25 శాతానికి పెంచింది. ఈ ఏడాది సైతం అంతే వడ్డీ అందించాలని ఈపీఎఫ్ఓ సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.

వాస్తవానికి, ఈపీఎఫ్ డిపాజిట్లపై కొంత పరిమితి వరకు ఎలాంటి పన్ను ఉండదు. మరోవైపు.. సీబీటీ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) స్కీమ్ కింద అందించే ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కూడా పెంచనుంది.

ఏడాది సర్వీసు పూర్తికాని చందాదారుడు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.50 వేలు పరిహారం అందుతుంది. ఇతరేతర కారణాల రీత్యా పీఎఫ్ చెల్లించని రోజులు నెల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇది వర్తించదు. చివరి చందా చెల్లించిన 6 నెలల్లో ఉద్యోగి మరణిస్తే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Read Also : UPI New Rules : గూగుల్ పే, పేటీఎంల్లో UPI పేమెంట్స్ చేస్తున్నారా? బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్ వచ్చాయ్..!

ఒకవేళ కంపెనీ నుంచి మరో కంపెనీకి చందాదారుడు మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్కరోజు గ్యాప్ వచ్చినా (EDLSI) స్కీం నుంచి బయటికి వచ్చినట్టే. కానీ, ఇకపై అలా ఉండదు. రెండు నెలల గడువు కలిగిన సర్వీసులో కూడా కొనసాగింపుగానే పరిగణిస్తారు.

ఈ సవరణ వల్ల ప్రతి సంవత్సరం 5వేల కన్నా ఎక్కువ సర్వీసులో మరణాల కేసులకు అధిక ప్రయోజనాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ మార్పు వల్ల ప్రతి ఏడాదిలో 14వేల కన్నా ఎక్కువ మరణ కేసులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఈ పథకం కింద సర్వీసును కొనసాగింపును పరిగణనలోకి తీసుకునే ప్రతిపాదనను కూడా సీబీటీ (CBT) ఆమోదించింది.