UPI New Rules : గూగుల్ పే, పేటీఎంల్లో UPI పేమెంట్స్ చేస్తున్నారా? బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్ వచ్చాయ్..!

UPI Bima-ASBA : మార్చి నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. పాలసీదారులు ప్రీమియం చెల్లింపులు తమ బ్యాంకు ఖాతాలలో నగదును బ్లాక్ చేసేందుకు ఈ (Bima-ASBA) యూపీఐ పేమెంట్ సిస్టమ్ అనుమతిస్తుంది.

UPI New Rules : గూగుల్ పే, పేటీఎంల్లో UPI పేమెంట్స్ చేస్తున్నారా? బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్ వచ్చాయ్..!

New UPI-based insurance payment system

Updated On : March 1, 2025 / 11:31 AM IST

Bima-ASBA UPI New Rules : గూగుల్ పే, పీటీఎంల్లో యూపీఐ పేమెంట్స్ చేస్తు్న్నారా? మీకో బిగ్ అలర్ట్.. మార్చి 1, 2025 నుంచి యూపీఐ పేమెంట్లలో కొత్త రూల్స్ వచ్చాయి. ప్రత్యేకించి బీమా ప్రీమియం చెల్లించే పాలసీదారులకు ఈ కొత్త యూపీఐ రూల్స్ వర్తిస్తాయి. చాలా మంది పాలసీదారులకు, బీమా ప్రీమియం చెల్లింపు ఆలస్యమైనప్పుడు పాలసీని కోల్పోవాల్సి వస్తుంది.

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ( IRDAI ) ఈ ప్రమాదాన్ని నివారించేందుకు (Bima-ASBA) అనే​యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. బీమాదారుడు పాలసీ ప్రతిపాదనను అంగీకరించే వరకు పాలసీదారుడి బ్యాంక్ ఖాతాలో డబ్బు అలానే ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రీమియం చెల్లింపునకు ఆ మొత్తం అందుబాటులో ఉండేలా చేస్తుంది. ప్రీమియం చెల్లింపు సమయంలో డబ్బులు లేకపోయినా పాలసీ కోల్పోయే పరిస్థితి ఉండదు.

Read Also : Child Future Plan : మీకు ఈ నెల జీతం వచ్చిందా? జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీ పిల్లల భవిష్యత్తును ఈ డబ్బే తీర్చిదిద్దుతుంది!

బీమా చెల్లింపులపై యూపీఐ కొత్త రూల్స్ ఇవే :
యూపీఐ కస్టమర్లు బీమా ప్రీమియం చెల్లింపుల కోసం సరికొత్త ఫీచర్ (Bima-ASBA)ను ప్రవేశపెట్టింది. బీమా-ఏఎస్‌బీఏ అంటే.. (Applications Supported by Blocked Amount) ఈ ఫీచర్ భారత బీమా నియంత్రణ సంస్థ (IRDAI) మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పాలసీదారులు యూపీఐ ద్వారా బీమా ప్రీమియం చెల్లించేందుకు బ్లాక్డ్ అమౌంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త విధానం ద్వారా పాలసీ జారీ అయ్యే వరకూ ప్రీమియం మొత్తం పాలసీదారుల అకౌంట్లలోనే బ్లాక్ చేసి ఉంటుంది. ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంటులో పడదు. బీమా కంపెనీ పాలసీ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అమౌంట్ మొత్తం బీమా కంపెనీ అకౌంట్లలోకి రిలీజ్ అవుతుంది. ఒకవేళ పాలసీ రిజెక్ట్ అయితే.. ఆ మొత్తం మీ అకౌంటులోకి రీఫండ్ అవుతుంది. ఈ కొత్త విధానం ద్వారా పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉండదు.

ఎలా పనిచేస్తుందంటే? :
గూగుల్ పే, ఫోన్ పే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసే పాలసీదారులు ముఖ్యంగా (Bima-ASBA) ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో సమర్పించాలి. దాంతో మీరు ఎంత అమౌంట్ బ్లాక్ చేయాల్సి ఉంటుందో కన్ఫార్మ్ చేయాలి.

పాలసీ అప్రూవల్ వస్తేనే మీ బ్యాంకు అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. యూపీఐ ద్వారా బీమా చెల్లింపులను ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు. పాలసీ ఆమోదించని సందర్భాల్లో ఆటోమేటిక్ మీ డబ్బు రీఫండ్ అవుతుంది. గరిష్ట బ్లాక్ వ్యవధి 14 రోజులు లేదా అండర్ రైటింగ్ పూర్తయ్యే వరకు ఉంటుందని గమనించాలి.

బ్యాంకు ఖాతాలో డబ్బులను ఎలా బ్లాక్ చేయాలి? :
బీమా పాలసీ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీ ఖాతాలోని ప్రీమియం మొత్తాన్ని బ్లాక్ చేసేందుకు బ్యాంకును అనుమతించే ఆప్షన్ కలిగిన ఫారమ్‌ను నింపండి.

యూపీఐ ద్వారా ఫండ్స్ బ్లాక్ : బీమా కంపెనీ మీ ఖాతాలో అవసరమైన మొత్తాన్ని బ్లాక్ చేయమని మీ బ్యాంకుకు (పార్టనర్ బ్యాంకు ద్వారా) అభ్యర్థనను పంపుతుంది.

Read Also : LPG Price Hike : పండుగ సీజన్‌లో సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. మీ నగరంలో కొత్త ధరలివే..

అప్రూవల్ – ఫండ్ హోల్డ్ :
బ్యాంక్ కస్టమర్ ఆమోదం కోరిన తర్వాత ఆ మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది. ఖాతాలో అమౌంట్ అలాగే ఉంటుంది.

ఆమోదం తర్వాత ప్రీమియం చెల్లింపు :
పాలసీ ఆమోదించకపోతే బీమా సంస్థ బ్లాక్ చేసిన మొత్తం డెబిట్ చేయమని బ్యాంకును అభ్యర్థిస్తుంది.

ఆటోమేటిక్ రీఫండ్ :
పాలసీ తిరస్కరించినా లేదా రద్దు చేసినా ఎలాంటి కోతలు లేకుండా మొత్తం అమౌంట్ అన్‌బ్లాక్ అవుతుంది.