Child Future Plan : మీకు ఈ నెల జీతం వచ్చిందా? జస్ట్ రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మీ పిల్లల భవిష్యత్తును ఈ డబ్బే తీర్చిదిద్దుతుంది!
Child Future Plan : భవిష్యత్తులో మీ పిల్లల చదువుకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎందులో పెట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Child Future Plan
Child Future Plan : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, ముందుగా ఈ పని చేయండి.. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టండి. చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పిల్లల చదువు కోసం లేదా వారి పెళ్లి కోసం ఆదా చేయాలని భావిస్తుంటారు. మరికొంతమంది పుట్టబోయే పిల్లల గురించి ముందుగానే ఎన్నో కలలు కంటుంటారు. పిల్లలను ఎలాంటి లోటు లేకుండా చదువుతో పాటు వారి భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తుంటారు.
అయితే, పిల్లలు పెరుగుతున్నా కొద్ది బాధ్యతలు సైతం పెరుగుతాయి. ప్రతి ఆడపిల్ల లేదా మగబిడ్డకు తప్పనిసరిగా చదువు ఉండాలి. ప్రస్తుత రోజుల్లో స్కూల్ ఫీజులు భారంగా మారాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు పిల్లలను చదివించడం కష్టంగా మారింది. చదువు కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ఉన్నత విద్యకు అంతకన్నా రెట్టింపు ఖర్చు తప్పదు. భవిష్యత్తులో విద్యకు మరింత ఖర్చులు పెరగొచ్చు కూడా.
జస్ట్ నెలకు రూ. 5వేలు ఇన్వెస్ట్ చేయడమే.. :
అందుకే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి? ఇది సాధ్యమేనా? అంటే ప్రతిఒక్కరికి సాధ్యమే. మీరు చేయాల్సిందిల్లా.. జస్ట్ నెలకు రూ. 5వేలు ఇన్వెస్ట్ చేయడమే.. ప్రస్తుతం మార్కెట్లో అనేక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
అందులో మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కూడా ఒకటి. మీరు మీకు జీతం పడగానే నెలకు కేవలం రూ.5వేలు పెట్టబడి పెట్టండి. అది 15 ఏళ్లలో రూ.25 లక్షలపైనే మీకు డబ్బు వస్తుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
15ఏళ్లు పెట్టుబడితో రూ. 25 లక్షలపైనే ఆదా :
పిల్లల చదువు కోసం మీరు ప్రతినెలా రూ. 5వేలు చొప్పున 15ఏళ్లు పెట్టుబడి పెడతూ వెళ్లారు అనుకుందాం. దీనికి మీకు వార్షిక రాబడి 12శాతంగా వస్తుంది. అంటే.. మీ ఇన్వెస్ట్ సగటుగా 12శాతం వార్షిక రాబడిని తెచ్చిపెడుతుంది. 15 ఏళ్లకు సుమారు రూ.25,22,880 డబ్బును మీరు అందుకుంటారు. అప్పుడు మీ పిల్లల ఉన్నత చదువుకు మీరు కూడబెట్టిన లక్షల సొమ్ము అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మీరు రోజుకు రూ.150 పెట్టుబడి పెడితే.. 15 ఏళ్లలో రూ.22 లక్షలు అవుతుంది. నెలకు రూ. 4,500 పెట్టాలి. అదే ఏడాదికి రూ.54వేలు పెట్టుబడి పెట్టాలి. 15 ఏళ్లలో రూ.8,10,000 పెట్టుబడి పెడతారు. 12 శాతం వార్షిక రాబడితో 15 ఏళ్లలో రూ.14,60,592 వడ్డీ పొందవచ్చు. సిప్ మెచ్యూర్ అయితే అప్పుడు మీ పెట్టుబడి మొత్తం రూ. 8,10,000కు రూ. 14,60,592 వడ్డీ వస్తుంది. ఈ రెండు కలిపితే మొత్తంగా రూ.22,70,592 మీ చేతికి డబ్బు అందుతుంది అనమాట.