Saturn Transit March 2025 : మార్చిలో అతిపెద్ద గ్రహ సంచారం.. ఈ 5 రాశుల జీవితాల్లో అద్భుతం జరగబోతుంది.. ఇక మీ మాటే శాసనం..!
Saturn Transit March 2025 : మార్చిలో మహా అద్భుతం జరగబోతుంది. అతిపెద్ద గ్రహ సంచారం ఉండనుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత శని గ్రహం ఈ నెలలో సంచారం చేయబోతున్నాడు. ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

Saturn Transit March 2025
Saturn Transit March 2025 : 2025 మార్చిలో అతిపెద్ద గ్రహసంచారం జరుగబోతుంది. కొన్ని రాశులవారికి జీవితంలో అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వారి మాటే శాసనం అన్నట్టుగా ఉండబోతుంది. అయితే, ఈ ఏడాది మార్చిలో హోలీ పండుగ కూడా వస్తోంది.
అంతేకాదు.. చైత్ర నవరాత్రి పండుగ కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. హిందువులకు నూతన సంవత్సరం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఈ మార్చి నెలకు మతపరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాదిలో మార్చి నెల మరింత ప్రత్యేకమైనది.
Read Also : AC Price Drop : వావ్.. భారీగా తగ్గిన ఏసీల ధరలు.. ఇందులో చాలా తక్కువ అంట.. ఇప్పుడే ఇంటికి కొని తెచ్చుకోండి!
ఎందుకంటే.. రెండున్నర సంవత్సరాల తరువాత శని ఈ నెలలో సంచారము చేయబోతున్నాడు. అంతేకాదు.. ఈ నెలలో సూర్యుడు, చంద్రుడు మాత్రమే తమ రాశిచక్రాలను మారనున్నారు. మార్చి నెలలో గ్రహ సంచారాలు ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.
మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 29న శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి రెండున్నర రోజులకు చంద్రుడు తన రాశిచక్రాన్ని మారుతాడు. ఈ నెలలో అతిపెద్ద గ్రహ సంచారము శని సంచారముగా చెప్పవచ్చు.
ఏయే రాశులకు కలిసి వస్తుందంటే? :
మార్చిలో శని సంచారము వల్ల 5 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశుల వారికి నుంచి శని పీడ తొలగిపోతుంది. దాంతో ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. శని పీడ కారణంగా ఏ పని నిలిచిపోయిందో అది ఇకనుంచి పూర్తి అవుతుంది.
మకర రాశి వారు శని సంచార సమయంలో శని సాడే సతి నుంచి ఉపశమనం పొందుతారు. దాంతో వారి జీవితాల్లో మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి. కుంభ రాశి వారు అత్యంత బాధాకరమైన సాడే సతి దశ నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారిపై శని సంచారం చివరి దశ కొనసాగుతోంది. మకర రాశివారిపై తక్కువ శని ప్రభావం ఉంటుంది. ఈ సంచారము తుల రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది.