AC Price Drop : వావ్.. భారీగా తగ్గిన ఏసీల ధరలు.. ఇందులో చాలా తక్కువ అంట.. ఇప్పుడే ఇంటికి కొని తెచ్చుకోండి!
AC Price Drop : కొత్త ఏసీలను కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ప్రస్తుతం వోల్టాస్, క్యారియర్ వంటి బ్రాండ్ల ఏసీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AC Price Drop
Air Conditioner Price Drop : వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు దంచికొడుతున్నాయి. కొన్నిచోట్ల ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇంట్లో ఏసీ లేదా కూలర్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి. అందుకే చాలామంది కొత్త ఏసీలు లేదా ఎయిర్ కూలర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మార్కెట్లో ఏసీలు ఎక్కడ తక్కువగా ఉన్నాయా అని వెతుకుతుంటారు. మీరు కూడా కొత్త ఏసీలను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ టైమ్. సమ్మర్ ప్రారంభంలో ఏసీల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరిగితే ఈ ఏసీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందుగానే ఏసీలను కొనేసుకోవడం బెటర్.
ఎయిర్ కండిషనర్ అంటే.. ఏసీల వాడకం సర్వసాధారణం. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీలను వాడేందుకు ఇష్టపడతారు. వేసవి ప్రారంభానికి ముందు ఏసీలను కొనడం మంచిది. ఎందుకంటే ఈ ఏసీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
విజయ్ సేల్స్ ప్రస్తుతం వోల్టాస్, క్యారియర్ వంటి బ్రాండ్ల ఏసీలపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఏసీ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. అతి చౌకైన ధరలకు లభించే ఏసీల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.
1. వోల్టాస్ 1 టన్ (3 స్టార్ అడ్జస్టబుల్ ఇన్వర్టర్) స్ప్లిట్ ఏసీ :
మీరు స్ప్లిట్ ఏసీని కొనాలనుకుంటే.. ఈ ఏసీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 1 టన్ ఏసీ, 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. అనేక మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ ఏసీ ఒక గదికి బెస్ట్ ఆప్షన్.
ఈ వోల్టాస్ ఏసీ ధర రూ. 56,990. కానీ, విజయ్ సేల్స్‌లో 48శాతం తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ ఏసీని రూ.29,900కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసీపై రూ.27,090 సేవ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు ఈ ఏసీని ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
Read Also : iPhone 16e Sale : ఆపిల్ ఐఫోన్ 16e ఎక్కడ కొంటే బెటర్.. ఇండియాలోనా లేదా దుబాయ్‌లోనా? ధర ఎక్కడ తక్కువ ఉందంటే?
2. క్యారియర్ డ్యూరావైట్ ఇన్వర్టర్ ఏసీ :
క్యారియర్ డ్యూరావైట్ ఈఎక్స్ఐ స్ప్లిట్ 6in1 కన్వర్టిబుల్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఏసీ 1.5 టన్ 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. పవర్ బాగా సేవ్ చేస్తుంది. ఈ ఏసీలో ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో ఆటో క్లెన్సర్ కూడా ఉంది.
ఈ ఏసీ ధర రూ.75,490. కానీ, విజయ్ సేల్స్ ఈ ఏసీపై 46శాతం తగ్గింపు అందిస్తోంది. మీరు ఈ ఏసీని రూ.40,990కి ఆర్డర్ చేయవచ్చు. అంతేకాదు.. బ్యాంక్ డిస్కౌంట్ ద్వారా ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఫుల్ పేమెంట్ ఒకేసారి చేయకూడదనుకుంటే, మీరు ఈ ఏసీని ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.