iPhone 16e Price : ఆపిల్ ఐఫోన్ 16e ఎక్కడ కొంటే బెటర్.. ఇండియాలోనా లేదా దుబాయ్‌లోనా? ధర ఎక్కడ తక్కువ ఉందంటే?

iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e సేల్ కొనసాగుతోంది. భారత్‌లో డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ డీల్స్‌తో సరసమైన ఐఫోన్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. దుబాయ్‌లో ఇతర దేశాల్లో ఐఫోన్ 16e ధర ఎంత ఉందో తెలుసా?

iPhone 16e Price : ఆపిల్ ఐఫోన్ 16e ఎక్కడ కొంటే బెటర్.. ఇండియాలోనా లేదా దుబాయ్‌లోనా? ధర ఎక్కడ తక్కువ ఉందంటే?

Buying iPhone 16e in India vs buying it in Dubai

Updated On : February 28, 2025 / 5:10 PM IST

iPhone 16e Sale Offers : ఆపిల్ లవర్స్ కోసం ఐఫోన్ 16e ఇప్పుడు భారత మార్కెట్లోకి అమ్మకానికి అందుబాటులో ఉంది. 128GB మోడల్ రూ. 59,900 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కొనుగోలు చేయగల అత్యంత చౌకైన ఐఫోన్ ఇదే. భారతీయ కొనుగోలుదారులు బ్యాంక్ డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ డీల్స్ ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

కానీ, భారత్ కన్నా ఐఫోన్ ధరలు సాధారణంగా చౌకగా ఉండే యుఎఇ, యుఎస్ వంటి దేశాల్లో ఐఫోన్ 16e ధర ఎంత ఉందో తెలుసా? మీరు ఐఫోన్ 16eని ఎక్కడ కొంటే తక్కువ ధరకు వస్తుంది? అంతర్జాతీయ ధరలు, ఆఫర్‌ల గురించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : AP Budget 2025 : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?

భారత మార్కెట్లో ఐఫోన్ 16e మోడల్ 128GB వేరియంట్ ధర రూ.59,900, 256GB మోడల్ ధర రూ.69,900, 512GB వెర్షన్ ధర రూ.89,900కు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఐఫోన్ ధరను మరింత తగ్గించే డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.

తద్వారా ఈ ఐఫోన్ ధరను రూ. 55,900కు తగ్గిస్తుంది. అదనంగా, ట్రేడ్-ఇన్ డీల్స్ కొనుగోలుదారులకు రూ. 48,900 వరకు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ చేసే డివైజ్ వాల్యూ బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఇతర దేశాల్లో ధరలతో పోల్చి చూస్తే.. ఐఫోన్ 16e ధర చాలా భిన్నంగా ఉంటుంది.

అమెరికాలో బేస్ మోడల్ 599 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. అంటే.. దాదాపు రూ. 51,970 అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16e అత్యంత సరసమైనదిగా చెప్పవచ్చు. జపాన్‌‌లో కూడా అమెరికా ధరలకు దగ్గరగానే ఉన్నాయి. 128GB వేరియంట్ ధర 99,800 యెన్లు.. దాదాపు రూ. 57,599 ఉంటుంది.

మరోవైపు, యూఏఈలో ఐఫోన్ 16e బేస్ మోడల్ AED 2,599 అంటే.. దాదాపు రూ. 61,470 అనమాట. ఈ ధర భారత మార్కెట్లో కన్నా ఎక్కువనే చెప్పాలి. అదేవిధంగా, యూకేలో ఐఫోన్ 16e ధర £599.. అంటే.. దాదాపు రూ.65,460 ఉంటుంది. ఇప్పుడు, డైరెక్ట్ కన్వర్షన్‌ను పరిశీలిస్తే.. ఐఫోన్ 16e ధర యూఏఈ, యూకేలతో పోలిస్తే సరసమైనది కానీ, అమెరికా, జపాన్‌ల కన్నా కొంచెం ఖరీదైనదిగా చెప్పవచ్చు.

విదేశాల్లో ఐఫోన్ 16e కొనాలా? వద్దా? :
అమెరికా, జపాన్ తక్కువ ధరలకే ఈ ఐఫోన్ అందిస్తున్నప్పటికీ, విదేశాలలో కొనుగోలు చేయడం వల్ల డివైజ్ దిగుమతి చేసేందుకు పన్నులు, షిప్పింగ్, వారంటీ సమస్యలు వంటివి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గమనించాలి.

అదేవిధంగా, యూఏఈలో ఐఫోన్ కొనుగోలు చేస్తే కొన్ని వేల రూపాయలు సేవ్ చేయొచ్చు. కానీ, చాలా మంది భారతీయ కొనుగోలుదారులకు సరైన ఎంపిక కాదని చెప్పవచ్చు. మరోవైపు, భారత్ ట్రేడ్-ఇన్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఐఫోన్ తక్కువ ధరకే అందిస్తున్నాయి. విదేశాలకు వెళ్లకుండా తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఐఫోన్ 16e ఫీచర్లు :
ఐఫోన్ 16e మోడల్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫేస్ ఐడీ ఐకానిక్ నాచ్‌ కూడా ఉంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్ల మాదిరిగానే యాక్షన్ బటన్‌ కలిగి ఉంది. కెమెరా ఆన్ లేదా డోంట్ డిస్టర్బ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయొచ్చు. ఐఫోన్ 16e ఆపిల్ లేటెస్ట్ A18 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 6-కోర్ జీపీయూ కలిగి ఉంటుంది.

Read Also : iPhone 16e Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16eపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఐఫోన్ 11లో వాడిన A13 చిప్ కన్నా 80 శాతం వేగవంతమైనది. ఐఫోన్ 16eలో 4-కోర్ జీపీయూ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉన్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ జెన్మోజీ, రైటింగ్ టూల్స్, చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ పరంగా, ఐఫోన్ 16e మోడల్ 2x టెలిఫోటో జూమ్, నైట్ మోడ్, HDR, పోర్ట్రెయిట్ మోడ్‌తో కూడిన 48ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌కు సపోర్టు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంటుంది.