Power Bill Tips : అసలే ఎండకాలం.. మీ ఇంట్లో ఈ 3 వస్తువులను అసలు వాడొద్దు.. కరెంట్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!
Power Bill Tips : వేసవి కాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులను సగానికి సగం తగ్గించుకోవచ్చు. మీరు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గడం మీరే చూస్తారు..

Power Bill Tips
Power Bill Tips : ఎండకాలం వస్తోంది. ప్రతిఒక్కరి ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. దాంతో నెలకు వచ్చే కరెంట్ బిల్లుతో తడిసి మోపడు అవుతుంది. సమ్మర్ సీజన్‌లో ఫ్యాన్, ఏసీలు వాడకుండా ఉండలేం కదా. ప్రస్తుత రోజుల్లో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి.
Read Also : PF Interest : వేతన జీవులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై బిగ్ అప్‌డేట్.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?
ప్రతి ఇంట్లో విద్యుత్ పొదుపు చేయడం తప్పనిసరి. హైఎండ్ అప్లియన్సెస్, ఎల్ఈడీ బల్బులను వాడటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. కానీ, కొన్నిసార్లు చిన్న తప్పులే ఎక్కువ విద్యుత్ వినియోగానికి కారణమవుతాయని మర్చిపోవద్దు.
వేసవి కాలంలో కరెంట్ వినియోగం విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో విద్యుత్ బిల్లు చాలా ఎక్కువగా రావడం కామన్. కొన్ని వస్తువుల వాడకాన్ని తగ్గించడం లేదా ఆపేయడం ద్వారా మనం విద్యుత్ బిల్లును సగానికి సగం తగ్గించవచ్చు. అయితే, మీరు ఇంట్లో విద్యుత్ బిల్లు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
సాధారణ ఏసీ వద్దు.. ఇన్వర్టర్ ఏసీ ముద్దు :
మీరు విద్యుత్తును ఆదా చేయాలనుకుంటే.. నాన్-ఇన్వర్టర్ ఏసీకి బదులుగా ఇన్వర్టర్ ఏసీని ఉపయోగించండి. ఇన్వర్టర్ ఏసీ సాధారణ ఏసీ కన్నా చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీ అవసరానికి అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తుంది. దీని కారణంగా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. మీకు విద్యుత్ బిల్లును కూడా తగ్గిస్తుంది.
Read Also : Whatsapp : వాట్సాప్‌లో వండర్‌ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో.. ప్రొఫైల్ లింకులపై కంట్రోల్ మీదే..!
అవసరమైనప్పుడు మాత్రమే ఫ్యాన్ వేయండి :
విద్యుత్తును ఆదా చేయాలంటే.. అవసరమైనప్పుడు మాత్రమే ఫ్యాన్‌ను వాడండి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఫ్యాన్ ఆపడం మర్చిపోవద్దు. ఫ్యాన్‌లను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. తద్వారా విద్యుత్తు ఆదా అవుతుంది.
మైక్రోవేవ్‌లను తక్కువగా వాడండి :
మైక్రోవేవ్‌లు విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా అనవసరంగా ఆన్‌లో ఉంచినప్పుడు.. విద్యుత్ వృథా అవుతుంది. మీరు మైక్రోవేవ్‌ను వాడిన తర్వాత పవర్ బటన్‌ను ఆపివేయండి. మైక్రోవేవ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ స్టాండ్‌బై మోడ్‌లో ఉంచవద్దు. ఎందుకంటే.. ఉపయోగంలో లేనప్పుడు కూడా విద్యుత్తును వినియోగిస్తాయని గమనించాలి.