Salary Management : మీకు ఈ నెల జీతం వచ్చిందా? ఇప్పుడే ఇలా పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు.. హాయిగా బతికేయొచ్చు..!
Salary Management : జీతం రాగానే పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి. ప్రతి నెలా జీతంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ పోతే జీవితాంతం డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. మనీ టెన్షన్ లేకుండా హాయిగా బతికేయొచ్చు.

Salary Management
Salary Management : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే, ఒక్క క్షణం ఆలోచించండి.. ఖర్చులు ప్రతినెలా ఉంటాయి.. ఆ ఖర్చుకు తగినట్టుగా మీరు నెలవారీ బడ్జెట్ వేసుకోండి. తక్కువ జీతమైనా లేదా ఎక్కువ జీతం ఉన్నా ఈ పని మాత్రం తప్పక చేయండి.. జీతం చేతిలోకి వచ్చిన వెంటనే మీరు ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు పెట్టిన ఈ పెట్టుబడి భవిష్యత్తులో డబ్బుకు కొరత లేకుండా హాయిగా బతికేయొచ్చు.
Read Also : Power Bill Tips : అసలే ఎండకాలం.. మీ ఇంట్లో ఈ 3 వస్తువులను అసలు వాడొద్దు.. కరెంట్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావిస్తారు. సొంతంగా వ్యాపారం పెట్టి ప్రతి నెలా భారీ రాబడిని పొందాలని అనుకుంటారు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు పెద్దగా డబ్బు సంపాదించరు. వారి నెలవారీ జీతం అన్ని ఖర్చులకు సరిపోతుంటుంది.
నెల జీతంపై ఆధారపడే వాళ్లు పెద్దగా డబ్బు పెట్టుబడి పెట్టలేరు. ఈ కారణంగా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా తక్కువ జీతాలు ఉన్నవారికి మరింత కష్టమవుతుంది.
ప్రతి వ్యక్తి తన ఖర్చులకు తగినట్టుగా బడ్జెట్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఖర్చుల బడ్జెట్ ద్వారా మనం మన ఖర్చులను నియంత్రించుకోవచ్చు. అవసరమైతే ఆదా చేసే డబ్బు కూడా పెట్టుబడి కూడా పెట్టవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టే ముందు ఒక రూల్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఈ రూల్ పాటించడం ద్వారా మీరు ఎక్కువ సంపాదించినా లేదా తక్కువ సంపాదించినా ఎప్పటికీ డబ్బు కొరత అనేది మీ జీవితంలో కనిపించదు.
ప్రతి ఒక్కరూ ఈ రూల్ పాటించాలి :
ముందుగా మనం 50-30-20 రూల్ గురించి తెలుసుకుందాం. మీరు ప్రతి నెలా ఈ రూల్ పాటిస్తే.. ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాన్ని గడపవచ్చు. ఈ రూల్ ప్రకారం.. 50 అంటే.. నెలవారీ ఆదాయం. అదే మీ జీతంలో 50 శాతం అనమాట. మీ జీతంలో 50 శాతం బిల్లులు, ఫీజులు, అద్దె మొదలైనవి ఖర్చులకు మాత్రమే ఉపయోగించాలి.
30 అంటే.. మీ ఆదాయంలో 30 శాతం అనమాట.. ప్రయాణం, షాపింగ్ వంటి మీ కోరికలను నెరవేర్చేందుకు ఉపయోగించాలి. మీ జీతంలో మరో 30 శాతం ఖర్చుల కోసం ఉంచుకోవాలి. అలాగే, మీ జీతంలో మరో 20 శాతం ఏదైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లలో పెట్టుబడి పెట్టాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్లాన్ చాలా బాగుంటుంది. మీకు ప్రతినెలా జీతం రాగానే రూ.5వేలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. అలా 15 ఏళ్లలో రూ.25 లక్షలపైగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ వార్షిక రాబడి 12శాతం. ఇన్వెస్ట్ సగటుగా 12శాతం వార్షిక రాబడి వస్తుంది. 15 ఏళ్లకు సుమారుగా రూ.25,22,880 సంపాదించుకోవచ్చు.
అదే రోజుకు రూ.150 ఇన్వెస్ట్ చేసినా 15 ఏళ్లలో రూ.22 లక్షలు ఆదా అవుతుంది. నెలకు రూ. 4,500 ఇన్వెస్ట్ చేసినా ఏడాదికి రూ.54వేలు ఇన్వెస్ట్ చేయాలి. అది 15 ఏళ్లలో రూ.8,10,000 పైగా ఇన్వెస్ట్ చేస్తారు. వార్షికంగా 12 శాతం రాబడితో 15 ఏళ్లలో రూ.14,60,592 వడ్డీ వస్తుంది. సిప్ మెచ్యూర్ ద్వారా మీ పెట్టుబడి రూ. 8,10,000 అయితే రూ. 14,60,592 వడ్డీ రాబడిగా అందుతుంది. మొత్తంగా రూ.22,70,592 లక్షల డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.