SIM Aadhaar Link : మీ వద్ద సిమ్ కార్డులెన్నీ.. ఆధార్‌‌తో ఎన్ని లింక్ అయ్యాయి? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!

SIM Aadhaar Link : మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో తెలుసుకోవాలని ఉందా? ఆన్‌లైన్‌ ద్వారా మీ ఆధార్‌లో సిమ్ కార్డుల స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

SIM Aadhaar Link : మీ వద్ద సిమ్ కార్డులెన్నీ.. ఆధార్‌‌తో ఎన్ని లింక్ అయ్యాయి? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!

SIM Aadhaar Link

Updated On : March 1, 2025 / 4:52 PM IST

SIM Aadhaar Link : మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ నంబర్లు లింక్ అయ్యాయో మీకు తెలుసా? సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని అందరికి తెలిసిందే. మోసాలు లేదా తప్పుడు మార్గంలో దుర్వినియోగాన్ని నివారించేందుకు మీరు యాక్టివ్ సిమ్ కార్డుల సంఖ్య ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆధార్-లింక్డ్ సిమ్‌లను ఎందుకు చెక్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆధార్‌తో ఎన్ని సిమ్ కార్డులు లింక్ ఉండాలి :
నేటి డిజిటల్ యుగంలో, ఆధార్, మొబైల్ నంబర్లు రెండూ చాలా అత్యవసరంగా మారాయి. బ్యాంకింగ్, ఉద్యోగాలు, ప్రభుత్వ సేవలకు ఆధార్ కీలకమైన గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. అయితే, మొబైల్ ఫోన్లు కూడా అందరికి ఎప్పుడూ కనెక్ట్ అయ్యేలా ఒక నిత్యవసరంగా మారాయి.

Read Also : Salary Management : మీకు ఈ నెల జీతం వచ్చిందా? ఇప్పుడే ఇలా పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు.. హాయిగా బతికేయొచ్చు..!

సిమ్ కార్డులను కొనుగోలు చేసే ముందు ఆధార్ తప్పనిసరి. ఎందుకంటే.. మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి మీ ఆధార్ కింద ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులను ఒక ఆధార్‌కు లింక్ చేయవచ్చు.

ఈ పరిమితిని మించితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీ ఆధార్‌కు ఎన్ని నంబర్లు లింక్ అయ్యాయో మీకు కచ్చితంగా తెలియకపోతే, నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలో ఇప్పడు తెలుసుకుందాం.

ఆధార్‌తో లింక్ చేసిన సిమ్‌లను ఈ కింది విధంగా చెక్ చేయొచ్చు :
మీ ఆధార్ కింద ఎన్ని సిమ్‌లు రిజిస్టర్ అయ్యాయో చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

1. మీ టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయండి :

  • మీ టెలికాం ఆపరేటర్ (Airtel, Jio, Vi, లేదా BSNL) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • ‘Aadhaar Linking’ లేదా ‘Verify Number’ ఆప్షన్ కోసం చూడండి.
  • మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేసి రిక్వెస్ట్ సమర్పించండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • మీ ఆధార్‌కు లింక్ చేసిన యాక్టివ్ నంబర్‌ల లిస్టును చూసేందుకు OTPని ఎంటర్ చేయండి.

2. మొబైల్ USSD కోడ్ ద్వారా చెక్ చేయండి :

  • మీ మొబైల్ ఫోన్ నుంచి** *121# ** డయల్ చేయండి.
  • లింక్ చేసిన మొబైల్ నంబర్‌లను చెక్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  • ఈ సర్వీసును టెలికాం ఆపరేటర్లు త్వరిత ధృవీకరణ కోసం అందిస్తున్నారు.
  • సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఆధార్-లింక్ చేసిన సిమ్‌లను చెక్ చేయండి.
  • ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌లను ట్రాక్ చేసేందుకు సంచార్ సాథీ పోర్టల్ (https://www.sancharsaathi.gov.in/) విజిట్ చేయొచ్చు.
  • సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ‘Citizen Centric Services’ పై క్లిక్ చేయండి.
  • ‘Know Your Mobile Connections (TAFCOP)’ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, మీ ఫోన్‌కు పంపిన OTP ఉపయోగించి ధృవీకరించండి.
  • వెరిఫికేషన్ తర్వాత మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ల జాబితాను చెక్ చేసుకోండి.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు పండగే.. జీవితాంతం ప్రతి నెలా రూ. 20,500 సంపాదించవచ్చు!

మీ ఆధార్-లింక్డ్ సిమ్‌లను ఎందుకు చెక్ చేయాలంటే? :

  • సిమ్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఆధార్‌ను అనధికారికంగా వాడకుండా నివారించవచ్చు :
  • అనుమతించిన పరిమితిని మించి ఉంటే.. చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు.
  • మోసం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మీ వివరాలు దుర్వినియోగం కాకుండా చూడొచ్చు.
  • మీ ఆధార్-లింక్డ్ సిమ్ కార్డులను ఇలా సులభంగా ట్రాక్ చేయవచ్చు.
  • మీకు గుర్తుతెలియని ఏమైనా ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వండి.