Nothing Phone 3a Pro : కొత్త నథింగ్ ఫోన్ 3a ప్రో ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Nothing Phone 3a Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3a ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 3a Pro
Nothing Phone 3a Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ 3a ప్రో ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ. 5వేలు డిస్కౌంట్ అందిస్తోంది. 2025లో ఈ మిడ్-బడ్జెట్ ఫోన్ (Nothing Phone 3a Pro) ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 18న లాంచ్ అయింది.
సూపర్ వాల్యూ వీక్ సేల్ సందర్భంగా తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్-కెమెరా సెటప్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో మూడు 50MP సెన్సార్లు కూడా ఉన్నాయి. పూర్తి ఫీచర్లకు సంబంధించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ 3a ప్రోపై డిస్కౌంట్ :
నథింగ్ ఫోన్ 3a ప్రో 3 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 256GBకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ నథింగ్ ఫోన్ ప్రారంభ ధర రూ. 29,999కు పొందవచ్చు.
అదనంగా రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. బేస్ మోడల్ అసలు ధర రూ. 32,999కు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. ఈ 2 వేరియంట్లు ధర వరుసగా ఇప్పుడు రూ. 31,999, రూ. 33,999కు కొనుగోలు చేయొచ్చు.
నథింగ్ ఫోన్ 3a ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. డిస్‌ప్లే పాండా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OSలో రన్ అవుతుంది.
ఈ నథింగ్ ఫోన్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 50W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, NFC వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ కెమెరా సిస్టమ్ 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 3a ప్రో ఫీచర్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల, అమోల్డ్, 120Hz
ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3
స్టోరేజీ : 12GB + 256GB
బ్యాటరీ : 5000mAh, 50W
కెమెరా : 50MP + 8MP + 50MP, 50MP
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15, నథింగ్ OS