Top-selling iPhones : అమెజాన్‌లో అదిరే సేల్స్.. ఐఫోన్ 13పై ఆకర్షణీయమైన ఆఫర్లు.. టాప్ సెల్లింగ్ ఐఫోన్ల లిస్టు మీకోసం.. ఓ లుక్కేయండి!
Top-selling iPhones : అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఐఫోన్లు ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ పలు కలర్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. టాప్ సెల్లింగ్ ఐఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.

Top-selling iPhones on Amazon
Top-selling iPhones : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ప్రస్తుతం మార్కెట్లో అనేక కొత్త ఐఫోన్ మోడల్స్ ఉన్నాయి. ఏ ఐఫోన్ కొనుగోలు చేయాలో తెలియడం లేదా? అమెజాన్ ఇండియాలో టాప్ సెల్లింగ్ ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
అందులోనూ ఐఫోన్ 13 మోడల్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 మోడల్ మిడ్ నైట్ వేరియంట్ నుంచి గ్రీన్ వేరియంట్ వరకు అనేక ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు. మీరు కూడా కొత్త ఐఫోన్ కొనాలని భావిస్తే ఇప్పుడే అమెజాన్ ఇండియాలో ఐఫోన్ 13 కలర్ వేరియంట్లను ఓసారి లుక్కేయండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ 13 (128GB) మిడ్ నైట్ :
ఐఫోన్ 13లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్, డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. 5జీ సామర్థ్యాలతో పాటు 19 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మిడ్‌నైట్ కలర్‌లో కూడా లభిస్తుంది. మంచి డిజైన్ ఆప్షన్ కలిగి ఉంది. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఆప్షన్లను కలిగి ఉంది.
ఆపిల్ ఐఫోన్ 13 (128GB) స్టార్‌లైట్ :
ఆపిల్ ఐఫోన్ 13 స్టార్‌లైట్ వెర్షన్ మోడల్.. పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 (128GB) స్టార్ లైట్ వేరియంట్ ధర రూ. 44,999గా ఉంది. పర్ఫార్మెన్, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ స్టార్‌లైట్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 44,999కు లభ్యమవుతుంది.
నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెలా ఈఎంఐ రూ.2,182తో కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 13 మిడ్‌నైట్ వేరియంట్ మాదిరిగానే ఈ మోడల్ ఆకర్షణీయమైన స్టార్‌లైట్ ఎండ్‌తో వస్తుంది. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.
ఐఫోన్ 13 (128GB) పింక్ :
ఆపిల్ ఐఫోన్ 13 పింక్ వెర్షన్ మోడల్.. పవర్‌ఫుల్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 (128GB) పింక్ వేరియంట్ ధర రూ. 44,999గా ఉంది. పర్ఫార్మెన్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ పింక్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 44,999కు కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో అందిస్తుంది. ప్రతి నెలా ఈఎంఐ రూ.2,182 నుంచి పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 13 (128GB) బ్లూ :
ఆపిల్ ఐఫోన్ 13 బ్లూ వెర్షన్ అత్యంత ఆకర్షణీయమైన మోడల్. పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఐఫోన్ 13 (128GB) మోడల్ ధర రూ. 44,999 మాత్రమే. ఈ ఐఫోన్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2.182 ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 13 (128GB) గ్రీన్ :
ఆపిల్ ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ గ్రీన్ కలర్ వేరియంట్ ఐఫోన్ 13 లైనప్‌కు ప్రత్యేకమైన టచ్‌ను అందిస్తుంది. అంతేకాదు.. టాప్-టైర్ స్పెసిఫికేషన్‌లను కూడా అందిస్తుంది. ఐఫోన్ లవర్స్ ఈ ఐఫోన్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.
నో కాస్ట్ ఈఎంఐతో పాటు మరెన్నో ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ.2,182 నుంచి ఉంటుంది. అమెజాన్‌లో ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 44,999 నుంచి అందుబాటులో ఉంది.