Toyota Discounts : టయోటా బంపర్ ధమాకా.. ఈ SUV మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలు ఆదా.. ఎలాగంటే?
Toyota Discounts April 2026 : టయోటా SUV కార్లపై అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. గ్లాంజా, హైరైడర్, హిలక్స్ మోడళ్లపై రూ. 5 లక్షల వరకు ఆదా చేయొచ్చు.
- Sreehari A
- Published On : April 12, 2026 / 07:09 PM IST
Toyota Discounts April 2026
- ఈ ఏప్రిల్ నెలలో టయోటా కారు కొంటున్నారా?
- టయోటా ఇండియా, టయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ కార్లపై భారీ డిస్కౌంట్లు
- ఆకట్టుకునే ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, యాక్సెసరీస్ ప్యాకేజీలపై మరెన్నో ఆఫర్లు
- టయోటా SUV లేదా హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 5 లక్షల వరకు ఆదా
Toyota Discounts April 2026 : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? 2026లో సరికొత్త టయోటా కారు కొనాలనుకుంటే ఇది మీకోసమే. ఈ ఏప్రిల్ నెలలో అదిరిపోయే ఫీచర్లతో టయోటా మోడల్ కార్లు డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. టయోటా ఇండియా, టయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, పవర్ ఫుల్ హిలక్స్‌తో సహా పాపులర్ కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఆకట్టుకునే ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, యాక్సెసరీస్ ప్యాకేజీలను అందిస్తోంది.
మీకు ఇష్టమైన టయోటా SUV లేదా హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 5 లక్షల వరకు (Toyota Discounts) ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి టయోటా మోడల్‌పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టయోటా గ్లాంజా :
టయోటా హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఏప్రిల్ 2026 నాటికి మార్కెట్‌లో రూ. 45వేల వరకు ఆకట్టుకునే బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 25వేల ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. గ్లాంజా పవర్ ఫుల్ 1.2-లీటర్ ఇంజన్, అద్భుతమైన రోడ్ మైలేజీని అందిస్తుంది. నగర ట్రాఫిక్ కోసం ఈ గ్లాంజా కారు సరిగ్గా సరిపోతుంది.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్ :
హైబ్రిడ్ కేటగిరీలో టయోటా హైరైడర్ ఒకటి. ఈ నెలలో అనేక అద్భుతమైన ఆఫర్లతో లభ్యమవుతోంది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్’ వేరియంట్లతో రూ. 80వేల వరకు భారీగా ఆదా చేసుకోవచ్చు. పాత డీజిల్ వాహనాన్ని పవర్ ఫుల్ టెక్నాలజీతో కొత్త SUVతో ఎక్స్చేంజ్ చేసేవారికి రూ. 50వేల భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
టయోటా హిలక్స్ :
ఈ రగ్గడ్ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్‌పై కంపెనీ ఏప్రిల్ 2026 వరకు రూ. 5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 3.50 లక్షల భారీ క్యాస్ డిస్కౌంట్, రూ. 1.50 లక్షల విలువైన ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ పొందవచ్చు. హిలక్స్ 4×4 సామర్థ్యం కఠినమైన భూభాగాల్లో వేగంగా దూసుకెళ్లగలదు.
టయోటా టైసర్, ఫార్చ్యూనర్ :
టయోటా కొత్త టైసర్ రూ. 35,000 వరకు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. రోడ్లపై ఆధిపత్యం చలాయించే ఫార్చ్యూనర్‌పై కంపెనీ నుంచి నేరుగా క్యాష్ డిస్కౌంట్ లేదు. కానీ, డీలర్ స్థాయిలో ఎక్స్ఛేంజ్ బోనస్, ఆకర్షణీయమైన యాక్సెసరీస్ ప్యాకేజీలు ఉన్నాయి. ఫార్చ్యూనర్ డిజైన్, పవర్ ఫుల్ ఇంజన్ ఇప్పటికీ రోడ్లపై ఇతర వాహనాలకు గట్టి పోటీనిస్తున్నాయి.
