×
Ad

Traffic Rules 2026 : ట్రాఫిక్ పోలీస్ అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్, ఈ 5 తప్పులు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ కట్!

Traffic Rules 2026 : పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారికి దబిడిదిబిడే.. డ్రైవింగ్ నిబంధనలను ఎక్కువ సార్లు ఉల్లంఘించినవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది జాగ్రత్త.

  • Published On : February 28, 2026 / 07:13 PM IST

Traffic Rules 2026

  • ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవు
  • 5 టైమ్ రూల్స్ అమల్లోకి.. ఏడాదిలో మించితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
  • ట్రాఫిక్ చలాన్లను తప్పక చెల్లించాలి, పెనాల్టీలను నివారించండి

Traffic Rules 2026 : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. డ్రైవింగ్ నిబంధనలను విస్మరించే ఎవరికైనా ఈ కొత్త రూల్స్ కఠినంగా ఉంటాయి. బైకు లేదా కారు ఏదైనా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జనవరి 1, 2026 నుంచే కొత్త మోటారు వాహన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనదారులకు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ రూల్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ 5 టైమ్స్ రూల్ ఏంటి? :
కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఒక ఏడాది లోపు 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి పట్టుబడితే, మీ డ్రైవింగ్ లైసెన్స్ (DL) సస్పెండ్ అవుతుంది లేదా పూర్తిగా రద్దు అవుతుంది.

ఈ నియమం ఒక క్యాలెండర్ సంవత్సరానికి (జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు) వర్తిస్తుంది. లైసెన్స్ రద్దుకు సంబంధించిన తుది నిర్ణయం ఆర్టీఓ (ప్రాంతీయ రవాణా కార్యాలయం) లేదా DTO (జిల్లా రవాణా కార్యాలయం) వద్ద ఉంటుంది.

ఈ ఐదు కారణాల వల్లే ప్రమాదాలు :
కేవలం పెద్ద ప్రమాదాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోరు. చిన్న చిన్న రోజువారీ ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా 5 ప్రమాదాలకు కారణమవుతాయి

  • అతివేగం
  • హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం
  • రెడ్ లైట్ వేయడం
  • ఇల్లీగల్ పార్కింగ్
  • ఓవర్‌లోడింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం

ఈ కఠినమైన చర్యలు ఎందుకంటే? :

భారత్‌లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం వల్ల ప్రవర్తన మారదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లైసెన్స్‌లు రద్దు చేయడం వంటి చర్యలు చేపడుతోంది. ఇప్పుడు, ప్రతి ఇ-చలాన్ మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌కు లింక్ అయి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మీకు చలాన్ పడుతుంది. అన్ని చలాన్ రికార్డులు ఒకే సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతాయి.

Read Also : SIM Binding Rule : SIM బైండింగ్ కొత్త రూల్.. మార్చి 1 నుంచి ఈ యూజర్లకు వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేయవు, ఏం చేయాలంటే?

మీరు ఏం చేయాలంటే? :
మీ రికార్డును చెక్ చేయండి :
పరివాహన్ పోర్టల్‌ను విజిట్ చేయడం ద్వారా లేదా ప్రభుత్వ యాప్‌లతో మీ లైసెన్స్‌కు లింక్ చేసిన చలాన్‌లను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి.

మీ చలాన్‌ వెంటనే చెల్లించండి :
మీకు చెల్లించాల్సిన చలాన్ ఉంటే.. 45 రోజుల వ్యవధిలోపు చెల్లించాలి. పేమెంట్ చేయని చలాన్లతో ప్రభుత్వ సర్వీసులైన (RC ట్రాన్స్‌ఫర్ లేదా అడ్రస్ అప్‌డేట్) పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి :
డ్రైవింగ్ చేసేటప్పుడు మీ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోండి. ట్రాఫిక్ చలాన్లు పడకుండా జాగ్రత్త పడటమే కాకుండా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ క్యాన్సిల్ అవ్వకుండా కాపాడుకోండి.